Home » Matti Manishi
వంగతోటలను ఖరీఫ్ లో జూన్ జూలై మాసాల్లో నాటతారు. ప్రస్థుతం కొన్ని ప్రాంతాల్లో నాటగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పంటకు తొలిదశనుండే చీడపీడల బెడద ఎక్కువ ఉంటుంది.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .
ఇటీవల కాలంలో జామపండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం.. అందుకు అనుగుణంగానే హైబ్రీడ్ రకాలు రావడం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది.
ఖరీఫ్ లో వరి సాగుచేయటం.. రబీలో బెండ, వంగ, మిర్చి లాంటి కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది కూరగాయల్లో బెండకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పంట విత్తుకున్నాక 45 రోజులకు కాత మొదలవుతోంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది.
అరటి పంటను ప్రధాన పంటగా సాగు చేస్తే దిగుబడి పొందడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు అరటి పంటలో అంతర పంటలుగా స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు 70 వేల ఎకరాల్లో రొయ్యల సాగు విస్తరించి ఉంది. వరుసగా రెండుసార్లు తెల్లమచ్చల వైరస్ దాడితో విలవిల్లాడిన రైతులు ఈసారి దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియన�
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది.
పూలలో బంతి ముఖ్యమైంది. వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్ లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
శ్రీ గంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోను, వివిధ కాస్మోటిక్స్ తయారీలోను విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని, వాటి వేర్లనుంచి కొంతమేర పోషకాలను గ్రహించటం ద్వారా పెరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశనగను వర్షాధారంగా విస్తారంగా సాగుచేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి.