Home » Rain Forecast
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉత్తర, దక్షిణ ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్�
జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు ఇంకా వరద కొనసాగుతుంది. కాగా, ఇప్పుడు ఏపీకి మరో అల్పపీడనం ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల �
తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది.