Telugu States : తెలుగు రాష్టాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది.

Telugu States : తెలుగు రాష్టాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

Telugustates Rains

Updated On : June 14, 2021 / 12:47 PM IST

Rains Forecast : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో స్పియర్‌ స్థాయి వరకు వ్యాపించింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆదివారం ఉత్తర పశ్చిమ ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు 4.5కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మరో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటు జల్లులు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

Read More : Telangana BJP : తెలంగాణలో బీజేపీ విస్తరణకు ప్రయత్నిస్తా – ఈటల