జపాన్ లో స్వల్ప భూకంపం సంభవించింది. ఇజు ద్వీపంలో శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది.
తాజాగా టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. నిన్న మూడు సార్లు భూ ప్రకంపనలు రావడంతో టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి.
అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్ లోని మోంటే క్యూమాడోకు 104 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించింది.
హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా వణికిపోయింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయింది.
జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది.
ఢిల్లీ, హర్యానాలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. గురుగామ్, హర్యానాలోని శెరియా, ఝజ్జర్, ఢిల్లోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.
ఉత్తరాఖండ్ లోని స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.
అరుణాచల్‌ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్‌లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.