Earthquake : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు
భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది.

Manipur Earthquake
Manipur Earthquake : మణిపూర్ లోని ఉఖ్రుల్ జిల్లాలో భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయింది. సోమవారం రాత్రి 11.01 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని ఎన్ సీఎస్ తెలిపింది.
జులై 21న ఉఖ్రుల్ లో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. తాజాగా మరో సారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కాగా, మంగళవారం అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదు అయింది.
Earthquake : టిబెట్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు
ఎన్ సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3.39 గంటలకు భూకంపం సంభవించింది. 93 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఇటీవలే జిజాంగ్, టిబెట్, మొరాకోలో భూకంపం సంభవించింది. మొరాకోలో భూకంపం ధాటికి 2వేలకు పైగా మృతి చెందారు.