Afghanistan Earthquake : ఆఫ్ఘానిస్తాన్‌, జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో భూకంపం

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.

Afghanistan Earthquake : ఆఫ్ఘానిస్తాన్‌, జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో భూకంపం

Earthquake (2)

Updated On : May 28, 2023 / 2:22 PM IST

Afghanistan – Delhi Earthquake : ఆఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 10.19 గంటలకు భూకంపం సంభవించింది. ఫైజాబాద్‌ లో భూప్రకంపనలు చోటు చేసున్నాయి. ఫైజాబాద్‌ ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైనట్లు ఈఎమ్ఎస్సీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటు చేసుకున్నాయని తెలిపింది.

Earthquake : మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు

భూకంప ప్రభావంతో జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. శ్రీనగర్, పూంచ్, ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని అధికారులు పేర్కొన్నారు.