Earthquake : మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు

పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Earthquake : మయన్మార్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.5గా నమోదు

Myanmar Earthquake

Myanmar Earthquake : మయన్మార్ లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్సీఎస్) పేర్కొంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5గా నమోదు అయిందని తెలిపింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

మరోవైపు ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది. గ్రామీణ హంబోల్ట్ కౌంటీ ప్రెట్రోలియాకు పశ్చిమాన 108 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యూస్ జీస్ పేర్కొంది. భూ అంతర్భాంగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని వెల్లడించింది.

New Caledonia Earthquake : ఫ్రాన్స్ న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

కాగా, రెండు రోజుల క్రితం పసిఫిక్ మహా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో వరుసగా భూకంపాలు సంభవించాయి. మే19న న్యూ కలెడోనియాకు తూర్పున ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. మే20వ తేదీన ఉదయం అదే ప్రాంతంలో 7.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.

సముద్ర ఉపరితలానికి 35 కిలోమీటర్ల లోతులో, న్యూ కలెడోనియన్ ద్వీప సమూహానికి తూర్పున 300 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జీఎస్ వెల్లడించింది. దీంతో సమీపంలోని వనౌతు, ఫిజీ, న్యూకలెడోనియా, కిరిబాటి, వాలిస్, ఫుటునా వంటి ద్వీప దేశాలకు సునామీ పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది.