Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు..

పాకిస్థాన్‌లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది.

Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు..

Pakistan Earthquake

Updated On : June 29, 2025 / 9:21 AM IST

Pakistan Earthquake: పాకిస్థాన్ లో ఆదివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెల్లవారు జామున 3.54 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. ప్రకంపనలు చాలా బలంగా ఉండటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగిందా అనే విషయంపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదు.

Also Read: హిమాచల్‌ ప్రదేశ్‌లో ‘పుష్ప’ మూవీ సీన్.. ‘హిమాచల్ పుష్పరాజ్ ఎక్కడ..?’ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్.. వీడియో వైరల్

భూకంప కేంద్రం ముల్తాన్ నగరానికి పశ్చిమాన 150 కిలోమీటర్ల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 30.25 ఉత్తర అక్షాంశం, 69.82 తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.


ఈనెల 1వ తేదీ నుంచి పాకిస్థాన్ లో 21సార్లు భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు. శనివారం కూడా పాకిస్థాన్ లో రెండు సార్లు భూమి కంపించింది. శనివారం సాయంత్రం 6.53 గంటల నుంచి 7గంటల మధ్య రెండు భూకంపాలు వచ్చాయి. అయితే, ఈ భూకంపాలు స్వల్ప తీవ్రతతో వచ్చాయి. కరాచీలో కూడా భూ ప్రకంపణలు సంభవించాయి.

‘పాకిస్థాన్ భౌగోళికంగా భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో ఉంది. యూరేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఈ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు భారీ భూఫలకాలు నిరంతరం ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.’