Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదు

ఈ భూకంప తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు హోక్కాయిడో దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు.

Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదు

earthquake (3)

Updated On : June 12, 2023 / 7:24 AM IST

Earthquake Hits Japan : జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదు అయింది. హోక్కాయిడో దీవుల్లో ఆదివారం సాయంత్రం 6.55 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. హోక్కాయిడో దీవికి వాయవ్య దిశగా భూమి లోపల 140 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది.

ఈ భూకంప తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు హోక్కాయిడో దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు. టోక్యోకు ఉత్తర దిశగా ఉన్న హోంషు దీవిలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

French Open 2023: చరిత్ర సృష్టించిన జకోవిచ్.. పురుషుల సింగిల్స్ టెన్నిస్‌లో సరికొత్త రికార్డు

ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ ప్రాంతంలోని అణ్వస్త్ర కేంద్రాలకు ఎటువంటి సమస్య తలెత్తలేదు. ఉత్తర ప్రాంతంలో తిరుగుతున్న బుల్లెట్ రైళ్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు.