Home » Sri Lanka Crisis
శ్రీలంక చరిత్రలో తొలిసారిగా దేశాధ్యక్షుడి భవనాన్ని నిరసనకారులు ముట్టడించి అందులోకి ప్రవేశించారు. కానీ ఏ ఒక్కరు గీత దాటలేదు. విధ్వంసం సృష్టించలేదు. విప్లవం అంటే నిరసన మాత్రమే.. విధ్వంసం కాదు అని నిరసనకారులు ప్రూవ్ చేశారు లంకేయులు.
శ్రీలంక అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గొటబయ రాజపక్సే సిద్ధమైనట్లు తెలుస్తోంది. జులై 13న అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేస్తారని ప్రధాని రణిల్ విక్రమసింఘేకు గొటబయ తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది.
అధ్యక్ష భవనం ముట్టడికి వేలాది మంది ఆందోళనకారులు తరలిరావడంతో పాటు భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది సూచనలతో గొటబయ అధ్యక్ష భవనంలోని బంకర్ గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఈ భవనంలో అత్యంత భద్రతా బంకర్ ను కనుగొన్నారు.
ఆర్థిక సంక్షోభంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోన్న శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులు నిన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంట్లోకి దూసుళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ
శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పాఠశాలలు కూడా ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించట్లేదు. శ్రీలంకలో పాఠశాలలు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూత పడనున్నాయి. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే విద్యార్�
శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.
పొరుగు దేశం శ్రీలంక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఆర్ధిక సంక్షోభంతో ఆహార పదార్ధాలను సైతం కొనుక్కోలేని పరిస్ధితిలో ప్రజలు అల్లాడి పోతున్నారు.
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.