Sri Lanka Crisis : కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం.. ప్రధాని నివాసానికి నిప్పు

శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు.

Sri Lanka Crisis : కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం.. ప్రధాని నివాసానికి నిప్పు

Sri Lanka Crisis

Updated On : July 10, 2022 / 12:29 AM IST

Sri Lanka Crisis : శ్రీలంకలో రావణకాష్టం రగులుతూనే ఉంది. ఆర్థిక సంక్షోభంపై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. నిరసనకారులు నేతల ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. శనివారం ఉదయం అధ్యక్షుడి నివాసంలోకి చొచ్చుకెళ్లిన నిరసనకారులు.. సాయంత్రం ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రైవేటు ఇంటి వైపు వెళ్లారు. ప్రధాని నివాసంలోకి చొరబడి నిప్పంటించారు. ప్రధానిగా రణిల్‌ రాజీనామా నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరిగింది. ‘ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి చొరబడి నిప్పంటించారు’ అని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో క‌ల‌క‌లం.. ఇంటి నుంచి అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ప‌రారీ

కాగా, శ్రీలంక ఆర్మీ ప్రధాని కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించింది. అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించిన తర్వాత ప్రధాని కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో సాయంత్రం వరకు సైలెంట్ గా ఉన్న విక్రమ సింఘే జనాగ్రహాన్ని చూసి భయపడి రాజీనామా చేయక తప్పలేదు. ఆయన రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు.

Sri Lanka Crisis: రాజపక్సే నివాసంలో మద్యం బాటిళ్లు.. ఆందోళన కారులు ఏం చేశారో తెలుసా? వీడియోలు వైరల్

అటు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీలో ఉన్నారు. గొటబయ రాజపక్స ఉదయం ఇంటి నుంచి పారిపోయారు. అసలాయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియదు. గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి నిరసనకారులు కొలంబోలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఓ ఎంపీని గుర్తించిన నిరసనకారులు అతడిని చావబాదారు. ఎంపీని చుట్టుముట్టి దారుణంగా కొట్టారు.

Sri Lanka Crisis: నేను కొనసాగలేను.. శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే రాజీనామా.. అదే బాటలో గొటబయ?

దేశంలో అఖిల పక్ష ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ లోగానే విధ్వంసకాండ చెలరేగింది. నిరసనకారులు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టారు. మరోవైపు నిరసనకారులు దేశాధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఇల్లంతా తిరిగారు. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి తమ నిరసన తెలిపారు. కొందరు కిచెన్‌లోకి వెళ్లి వంట వండుకుని తిని, మందు తాగిన వీడియోలు వైరల్ గా మారాయి. కాగా, ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నిరసన జ్వాలలు భగ్గమన్నాయి. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.