Home » stole
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు కొట్టేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రిటైర్డ్ మహిళా ప్రిన్సిపాల్ సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.7.25 లక్షలు పోగొట్టుకున్నారు.
జార్ఖండ్ లోని ఓ పెళ్లి వేడుకలో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ రూ.20 లక్షల విలువైన నగలు, డబ్బును ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
రాజస్థాన్ లో దారుణం జరిగింది. కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి రెండు కాళ్లు తెగ నరికేశారు. కాళ్లు తెగనరికి కడియాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది.
మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ దారుణానికి ఒడిగట్టారు. మహిళ మెడలో నుంచి కేటుగాళ్లు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. బైక్ పై వచ్చి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేశారు. బాధిత మహిళ కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యాండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.
డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో ఓ దొంగకు గుండెపోటుకు వచ్చింది. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
పటాన్ చెరు దగ్గర వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్ పరారయ్యాడు. మిరపకాయలు అమ్మి లారీలో వెళ్తుండగా వ్యాపారి డబ్బుతో డ్రైవర్ మాయమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్�