Thieves Stole Cell Tower : ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లిన దొంగలు
ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం... తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

CELL TOWER
Thieves Stole Cell Tower : రోజు రోజుకూ దొంగలు బరి తెగిస్తున్నారు. ఇటీవల బ్రిడ్జీలు, రైలింజన్ ను దొంగిలించిన ఘటనలను చూశాం… తాజాగా దొంగలు ఏకంగా సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు, కంపెనీ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవుపురాలోని గోశాల రోడ్ లోని 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువు ఉన్న టవర్ ను దొంగిలించారు. అయితే దీనిని రాత్రికి రాత్రే కాకుండా నెల రోజులపాటు విప్పి ఒక్కొక్క సామానును ఎత్తుకెళ్లారు.
వాటిలో జనరేటర్, బ్యాటరీ బ్యాంక్ కూడా ఉన్నాయి. దొంగిలించిన సెల్ టవర్ విలువ రూ.17 లక్షలు ఉంటుందని కంపెనీ నిర్వహకులు అంటున్నారు. సెల్ టవర్ ను 2009లో ఏర్పాటు చేశారు. దీనిని పర్యవేక్షించే టెక్నీషియన్ గతేడాది ఆగస్టులో రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నీషియన్ సెప్టెంబర్ లో వచ్చాడు. అయితే, ఈ నెల రోజుల వ్యవధిలో దొంగలు సెల్ టవర్ ను విప్పుకుని విడి భాగాలను ఎత్తుకెళ్లి పోయారు.
Train Engine Theft : ఏకంగా రైలు ఇంజిన్‌నే దొంగిలించి అమ్మేసిన రైల్వే ఇంజినీర్
తీరా కొత్త టెక్నీషియన్ వచ్చి చూసేసరికి సెల్ టవర్ లేదు. సెల్ టవర్ స్థానంలో ఖాళీ స్థలం కనిపించింది. టెక్నీషియన్ సమాచారం కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ ను చోరీ చేసిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.