Google Play Store : యాండ్రాయిడ్ యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్‌ని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి

యాండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.

Google Play Store : యాండ్రాయిడ్ యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్‌ని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి

Google Play Store

Updated On : July 4, 2021 / 7:52 PM IST

Google Play Store : తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్లు కాదు అనే సామెత గురించి వినే ఉంటారు. అంటే, దేన్నీ గుడ్డిగా నమ్మేయడం మంచిది కాదని అర్థం. ఇప్పుడీ గోల ఎందుకంటే… గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే ఆండ్రాయిడ్ యాప్ లన్నీ సేఫే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ డాక్టర్ వెబ్ అనే మాల్వేర్ విశ్లేషణ సంస్థ కొన్ని ఆండ్రాయిడ్ యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.

యాండ్రాయిడ్ యూజర్లను గూగుల్ అలర్ట్ చేసింది. సైబర్ భద్రత దృష్ట్యా 9 యాప్ లను గూగుల్ బ్యాన్ చేసింది. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్ లో ఆ యాప్స్ కానీ ఉంటే వెంటనే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది.

గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్..

* పీఐపీ ఫొటో – PIP Photo (over 5.8 million downloads)
* ప్రాసెసింగ్ ఫొటో – Processing Photo (500K+ downloads)
* రబ్బిష్ క్లీనర్ – Rubbish Cleaner (100K+ downloads)
* ఇన్ వెల్ ఫిట్ నెస్ – Inwell Fitness(100K+ downloads)
* హారోస్కోప్ డైలీ – Horoscope Daily (100K+ downloads)
* యాప్ లాక్ కీప్ – App Lock Keep (50K+ downloads)
* లాక్ ఇట్ మాస్టర్ – Lockit Master (5K+ downloads)
* హారోస్కోప్ పై – Horoscope Pi (1,000 downloads)
* యాప్ లాక్ మేనేజర్ – App Lock Manager (less than 100 downloads)

ముఖ్యంగా, ఈ 9 యాప్ లు యూజర్ల పాలిట ప్రమాదకరం అని డాక్టర్ వెబ్ వెల్లడించింది. ఇవి గతంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండేవని, అయితే వాటిపై ఫిర్యాదులు రావడంతో గూగుల్ వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. యూజర్లు కూడా తమ ఫోన్లలో ఈ 9 యాప్ లలో ఏది ఉన్నా జాగ్రత్తపడాలని డాక్టర్ వెబ్ హెచ్చరించింది.

ఇవి ప్రధానంగా ట్రోజన్ వైరస్ తరహా యాప్ లని, చూడ్డానికి సాధారణంగా కనిపించే కొన్ని లింకుల సాయంతో ప్రమాదకరమైన కొన్ని జావా స్క్రిప్టులను చొప్పించి, యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. అనంతరం ఆ సమాచారాన్ని సదరు యాప్ లు సైబర్ నేరగాళ్ల సర్వర్ లకు చేరవేస్తాయని వివరించింది.

ఈ ఆండ్రాయిడ్ యాప్స్ ఫేస్‌బుక్ యూజర్ల డేటాను దొంగిలించినట్లు డాక్టర్ వెబ్ వెల్లడించింది. చాలా మాల్వేర్ యాప్స్ లాగా కాకుండా ఇన్-యాప్ ప్రకటనలను నిలిపివేయడానికి, కొన్ని ఫీచర్స్ యాక్సెస్ చేసుకోవడానికి వారి ఫేస్‌బుక్ ఖాతాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. వినియోగదారుల ఎంటర్ చేసిన లాగిన్ వివరాలను వారు దొంగలిస్తారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం యూజర్ల డేటాను దొంగలించి ఉండొచ్చని డాక్టర్ వెబ్ తెలిపింది. ఏది ఏమైనా గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.