Person Stole Cat : హైదరాబాద్ లో పిల్లిని దొంగిలించిన వ్యక్తి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Person Stole Cat : హైదరాబాద్ లో పిల్లిని దొంగిలించిన వ్యక్తి.. కేసు నమోదు చేసిన పోలీసులు

CAT

Updated On : January 10, 2023 / 11:03 AM IST

Person Stole Cat : మనం ఇప్పటివరకు డబ్బులు, నగలు, విలువైన వస్తువులు, పెంపుడు కుక్కలను దొంగతనం చేయడం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా పెంపుడు పిల్లినే దొంగిలించాడు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. పిల్లి యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని వనస్థలీపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహార్ మహమూద్ అనే వ్యక్తి నివాసిస్తున్నారు.

అతను అరుదైన జాతికి చెందిన ఒక పిల్లిని రూ.50 వేలకు కొనుక్కున్నారు. ఆ పిల్లిని అతను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. 18 నెలల వయసున్న ఆ పిల్లికి నోమనీ అని పేరు కూడా పెట్టారు. ఆ పిల్లి కళ్లు ఒకటి గ్రీన్, రెండోది బ్లూ రంగులో ఉన్నాయి. ఇదే పిల్లి ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పిల్లిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లిపోయారు.

Greater Noida: కుక్క కోసం యజమాని కిడ్నాప్.. కుక్కను అడిగితే ఇవ్వలేదని యజమానినే ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు

దీంతో ఆ పిల్లి యజమాని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న పిల్లిని ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలో పిల్లిని ఓ వ్యక్తి ఎత్తుకుపోవడాన్ని గుర్తించారు.