Greater Noida: కుక్క కోసం యజమాని కిడ్నాప్.. కుక్కను అడిగితే ఇవ్వలేదని యజమానినే ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు

ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క తెగ నచ్చేసింది వాళ్లకు. ఆ కుక్క కోసం చివరకు దాని యజమానినే కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. కుక్కను ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు.

Greater Noida: కుక్క కోసం యజమాని కిడ్నాప్.. కుక్కను అడిగితే ఇవ్వలేదని యజమానినే ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు

Greater Noida: ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క వాళ్లకు నచ్చింది. అంతే ఆ కుక్క కోసం ఏకంగా యజమానినే కిడ్నాప్ చేశారు. కుక్కను ఇస్తేనే, ఆయన్ని విడిచిపెడతామని బెదిరించారు. ఈ అరుదైన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో జరిగింది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా, ఆల్ఫా 2 ప్రాంతంలో నివసించే రాహుల్ ప్రతాప్ అనే వ్యక్తి అరుదైన అర్జెంటినో జాతి కుక్కను పెంచుకుంటున్నాడు. అలీఘడ్ ప్రాంతానికి చెందిన విశాల్ కుమార్, లలిత్, మోంటీ అనే ముగ్గురు వ్యక్తులకు ఆ కుక్క నచ్చింది. దీంతో గత బుధవారం సాయంత్రం రాహుల్ ఇంటికి వచ్చిన ముగ్గురూ తమకు ఆ కుక్కను ఇచ్చేయమని అడిగారు. దీనికి రాహుల్ నిరాకరించాడు. దీంతో రాహుల్‌ను ఎత్తుకెళ్లారు. ఒక స్కార్పియో వాహనంలో రాహుల్‌ను కిడ్నాప్ చేసి అలీఘడ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తమకు ఆ కుక్కను ఇస్తే రాహుల్‌ను విడిచిపెడతామని, లేకుంటే చంపేస్తామని హెచ్చరించారు. దీనిపై రాహుల్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Elon Musk: జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసిన ఎలన్ మస్క్.. కారణం ‘డాక్సింగ్’

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తమపై పోలీస్ కేసు నమోదైందని తెలుసుకున్న కిడ్నాపర్లు రాహుల్‌ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. తర్వాత స్కార్పియో వాహనంలో పారిపోయారు. వెంటనే బాధితుడు రాహుల్ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ చేరుకుని, పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల్ని త్వరగానే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.