Elon Musk: జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసిన ఎలన్ మస్క్.. కారణం ‘డాక్సింగ్’

ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లను మస్క్ సస్పెండ్ చేశాడు.

Elon Musk: జర్నలిస్టుల ట్విట్టర్ అకౌంట్లు సస్పెండ్ చేసిన ఎలన్ మస్క్.. కారణం ‘డాక్సింగ్’

Elon Musk: ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క అనేక కీలక, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగుల్నితొలగించిన మస్క్ తాజాగా అమెరికాకు చెందిన పలువురు జర్నలిస్టుల ట్విట్టర్
అకౌంట్లను సస్పెండ్ చేశాడు.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

‘డాక్సింగ్’కు పాల్పడ్డందుకుగాను ఈ పని చేస్తున్నట్లు మస్క్ ప్రకటించాడు. మస్క్ నిషేధానికి గురైన అకౌంట్లలో ద న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ పత్రికల జర్నలిస్టులు ఉన్నారు. తన వ్యక్తిగత సమాచారాన్ని చేరవేస్తున్నందుకుగాను ఈ చర్య తీసుకున్నట్లు మస్క్ చెప్పాడు. వ్యక్తిగత సమాచారాన్ని చేరవేసేవాళ్లను హత్యకు పాల్పడేవారికి సహకరించేవాళ్లుగా మస్క్ అభివర్ణించాడు. ‘డాక్సింగ్’ అంటే ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో షేర్ చేయడం. అంటే వారి అడ్రస్, ప్రయాణ వివరాలు, ఫోన్ నెంబర్ వంటి సమాచారాన్ని పబ్లిక్‌గా ఆన్‌లైన్‌లో షేర్ చేస్తే దాన్ని డాక్సింగ్ అంటారు. చాలా మంది జర్నలిస్టులు తన సమాచారాన్ని ఇలా సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని, ఇది తనను, తన కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టడమే అని మస్క్ అభిప్రాయపడ్డాడు.

India vs Bangladesh: మూడో రోజు ఆట పూర్తి.. పూజారా, గిల్ సెంచరీలు.. బంగ్లాదేశ్ లక్ష్యం 513

డాక్సింగ్ వల్ల సంబంధిత వ్యక్తలకు నేరుగా లేదా పరోక్షంగా హాని కలిగే అవకాశం ఉంది. దాడి చేయడమో లేక హ్యాకింగ్‌కు పాల్పడటమో చేయొచ్చు. డాక్సింగ్ చేయడమంటే ఒకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లుగానే భావిస్తారు. అందుకే ఈ విషయాన్ని అమెరికాలో నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే మస్క్ తాజా చర్య తీసుకున్నాడు.