Best 5G Phones 2022 : రూ. 25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు!

Best 5G Phones 2022 : భారత్‌లోకి అతిత్వరలోనే 5G నెట్‌వర్క్ రాబోతోంది. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు స్మార్ట్‌ఫోన్ మేకర్లు కూడా 5G సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి.

Best 5G Phones 2022 : రూ. 25వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌‌ఫోన్లు ఇవే.. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనుక్కోవచ్చు!

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Best 5G Phones 2022 : భారత్‌లోకి అతిత్వరలోనే 5G నెట్‌వర్క్ రాబోతోంది. ఇప్పటికే దేశీయ టెలికం దిగ్గజాలు 5G సర్వీసులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు స్మార్ట్‌ఫోన్ మేకర్లు కూడా 5G సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఈ నెల 23 నుంచి (సెప్టెంబర్ 23) భారత్‌లో ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌లు జరుగనున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) అనేక 5G ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

మీరు కొత్త 5G ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన అవకాశం. భారత మార్కెట్లో ఇప్పటికే చాలా 5G స్మార్ట్ ఫోన్ మోడళ్లతో నిండిపోయాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5G ఫోన్లలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. ప్రతి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి ఒక 5G ఫోన్‌ ఎంపిక చేసి ఒక లిస్టుగా అందిస్తున్నాం. ఈ లిస్టులో OnePlus Nord CE 2, Samsung Galaxy A52, Moto Edge 30 వంటి మరిన్ని స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం.

OnePlus Nord CE 2 5G :
OnePlus Nord CE 2 స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. OnePlus ఫోన్‌ను కొనుగోలు చేస్తే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి.. ఈ డివైజ్ క్లీన్ ఫ్లూయిడ్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. బ్లోట్‌వేర్ (థర్డ్-పార్టీ యాప్‌లు)ను పొందలేరని గుర్తించుకోవాలి. యుటిలిటీ ఫీచర్‌ (Utility Features)లు కూడా ఉన్నాయి. హ్యాండ్‌సెట్ సాధారణ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్‌ను అందిస్తుంది. 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. హై-ఎండ్ కంటెంట్ వ్యూ‌ ఎక్స్‌పీరియన్స్ స్క్రీన్ HDR 10+కి కూడా సపోర్టు అందిస్తుంది. స్క్రీన్ 600nits బ్రైట్‌నెస్ కలిగి ఉంది.

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

సెగ్మెంట్‌లో ఇతర స్మార్ట్ ఫోన్ల కన్నా కొంచెం తక్కువగా ఉండవచ్చు. కానీ, మీరు ఔట్‌డోర్‌లో ఉన్నప్పుడు ఈ డివైజ్ స్క్రీన్ అద్భుతంగా పనిచేస్తుంది. డ్యూయల్ స్పీకర్లు లేవు. సాధారణ, హార్డ్ కోర్ టాస్క్‌ల కోసం డివైజ్ MediaTek డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌ని అందిస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. లైటింగ్‌లో అందమైన షాట్‌లను పొందవచ్చు. 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. కంపెనీ బాక్స్‌లో 65W ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేసేందుకు 45 నిమిషాలు సమయం పడుతుంది. OnePlus Nord CE 2 5G Flipkart ద్వారా రూ. 23,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది.

Redmi Note 11 Pro+ 5G :
Redmi Note 11 Pro+ మరో 5G స్మార్ట్‌ఫోన్ రూ. 25వేల లోపు కొనుగోలు చేయవచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67 AMOLED 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా పొందవచ్చు. సాధారణ పర్ఫార్మెన్స్ అందించగలదు. కెమెరాలో ఆకర్షణీయమైన కలర్స్ ద్వారా అద్భుతమైన ఫొటో షాట్‌లను తీయవచ్చు. సాధారణ 5,000mAh బ్యాటరీతో డివైజ్ 67W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. Redmi Note 11 Pro+ అమెజాన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ధర రూ. 20,999గా ఉంది.

Looking for best 5G phones under Rs 25,000 Check out these options(6)

Looking for best 5G phones under Rs 25,000 Check out these options

Moto Edge 30 5G :
మోటోరోలా Edge 30 కూడా ఇదే ధర రూ.25వేల లోపు జాబితాలో పొందవచ్చు. ఈ డివైజ్‌లో ప్రీ-ఇన్‌స్టాల్ (థర్డ్-పార్టీ) యాప్‌లు లేకుండా మరింత క్లీన్ ఇంటర్‌ఫేస్ అందిస్తుంది. అలాంటి డివైజ్ కోరుకునే యూజర్లకు Moto Edge 30 బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు. స్టాక్ Android ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. మోటో Edge 30 స్మార్ట్ స్క్రోలింగ్, గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 144Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. కొన్ని పాపులర్ గేమ్‌లకు 144Hz సపోర్టు చేయదని గుర్తించుకోండి. ఈ డివైజ్ Qualcomm Snapdragon 778G+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. సూపర్ స్పీడ్ పర్ఫార్మెన్స్ అందించగలదు.

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

కొన్ని ఫోన్‌ల కన్నా కొంచెం తక్కువ బ్యాటరీ యూనిట్‌ కలిగి ఉంది. హుడ్ కింద 4020mAh బ్యాటరీని అందిస్తుంది. రూ. 30వేల రేంజ్‌లో కొన్ని మిడ్-రేంజ్ 5G ఫోన్‌లు గరిష్టంగా 80W ఫాస్ట్ ఛార్జర్‌లతో పనిచేస్తాయి. కానీ, ఈ రెండు మోటో ఎడ్జ్ 30 5G ఫోన్లు కేవలం 33W ఛార్జర్‌తో మాత్రమే రన్ అవుతాయి.

కానీ, రెండోది ఇప్పటికీ బ్యాటరీని ఛార్జ్ అయ్యేందుకు దాదాపు 55 నిమిషాలు సమయం పడుతుంది. కెమెరా పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్‌గా ఉంది. ఫొటోలు అంత ఆకర్షణీయంగా ఉండవనే చెప్పాలి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సమయంలో భారత్‌లో Motorola Edge 30 5G ధర ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ఈ డివైజ్ Flipkart ద్వారా రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు.

Realme 9 Pro+ 5G :
రియల్‌మి 9 Pro+ కూడా రూ. 25వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా ఉంది. బెస్ట్ కెమెరా 5G ఫోన్ ఇష్టపడే యూజర్లకు Realme 9 Pro+ 5G ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోల కోసం అద్భుతమైన షాట్‌లను తీసుకోవచ్చు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. అంతేకాదు.. OISకి కూడా సపోర్టు అందిస్తుంది.

Mediatek డైమెన్సిటీ 920 SoC ద్వారా ఈ డివైజ్ పవర్ అందిస్తోంది. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. వినియోగదారులకు మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. హుడ్ కింద 4,500mAh బ్యాటరీ యూనిట్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్‌లో 6.4-అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. Realme 9 Pro+ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ధర రూ. 22,999గా ఉంది.

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Best 5G Phones 2022 : Looking for best 5G phones under Rs 25,000? Check out these options

Samsung Galaxy A52 5G :
శాంసంగ్ గెలాక్సీ A52 గత ఏడాదిలో లాంచ్ అయింది. పాత స్మార్ట్‌ఫోన్ అయినా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. Full HD+ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. HDR 10+ సపోర్టుతో AMOLED స్క్రీన్, ప్యానెల్, హై కలర్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. 800నిట్‌ల ఫుల్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. లైవ్ సన్‌లైట్ స్క్రీన్‌ను తగినంతగా కనిపించేలా చేస్తుంది. 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 720G SoC నుంచి పవర్ అందిస్తుంది. పవర్‌ఫుల్ Snapdragon 778G చిప్‌ కలిగిన Galaxy A52s కూడా సపోర్టు చేస్తుంది.

అయితే, ఈ మోడల్ ఛార్జర్ లేకుండా వస్తుంది. అమెజాన్‌లో దాదాపు రూ. 26వేల వరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. Samsung Galaxy A52 15W ఛార్జర్‌తో వస్తుంది. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 4,500mAh బ్యాటరీ యూనిట్ ఉంది. డివైజ్ IP67 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వచ్చింది. భారత్‌లో Samsung Galaxy A52 5G ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

Read Also : iPhone 15 Ultra Model : ఆపిల్ ఐఫోన్ 15 అల్ట్రా మోడల్‌ వస్తోంది.. ఐఫోన్ 14 మించి ఫీచర్లు ఉంటాయట.. లాంచ్ ఎప్పుడో తెలుసా?