Halley Comet Debris : ఈ వారమే ఆకాశంలో అద్భుతం.. హేలీ తోకచుక్క మళ్లీ వస్తోంది..

ఈ వారంలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. మిలమిల మెరిసే హేలీ తోకచుక్క నుంచి అవవేషాలు రాలిపడనున్నాయి. హేలీ తోకచుక్క అవశేషాలు మంగళవారం నుంచి గురువారం వరకు మనకంటికి కనిపించనున్నాయి.

Halley Comet Debris : ఈ వారమే ఆకాశంలో అద్భుతం.. హేలీ తోకచుక్క మళ్లీ వస్తోంది..

Debris From Halley's Comet Lighting Up The Sky This Week (2)

Halley Comet Debris : ఈ వారంలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. మిలమిల మెరిసే హేలీ తోకచుక్క నుంచి అవవేషాలు రాలిపడనున్నాయి. హేలీ తోకచుక్క అవశేషాలు మంగళవారం నుంచి గురువారం వరకు మనకంటికి కనిపించనున్నాయి. ఈ తోక చుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్లీ 2061 వరకు మరోసారి కనిపించదు. కానీ, ఈ తోక చుక్క అవశేషాలు ఇప్పటికీ మన భూ వాతావరణంలో తిరుగుతున్నాయి.

ప్రతి ఏడాదిలో రెండుసార్లు ఈ తోకచుక్క అవశేషాలు కనిపిస్తాయి. ఈ వారమంతా, భూమి సౌర వ్యవస్థ హేలీ తోక చుక్క నుంచి రాలిపోయిన దుమ్ముతో నిండిపోతుంది. ఈ ఏడాదిలో ఎటా అక్వేరిడ్స్ బుధవారం రాత్రి గురువారం ఉదయం వరకు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ అవశేషాలు మే 28 వరకు తిరుగుతూ కనిపిస్తాయి. ఈ ఏడాదిలో గంటకు 10 నుండి 20 ఉల్కలు ఆకాశమంతా విస్తరించాయి.

చంద్రుడు అస్తమించిన తర్వాత రాత్రి 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ తోకచుక్క అవశేషాలను చూడొచ్చు. తక్కువ ప్రకాశవంతమైన ప్రాంతంలో నిలబడి ఆకాశంలో అద్భుతాన్ని చూడొచ్చు. అనేక వందల ఏళ్ల క్రితం తోకచుక్క నుంచి వేరైన ఉల్కలు వలె ఈ హేలీ తోకచుక్క కణాలు ప్రస్తుత కక్ష్యలో తిరుగుతున్నాయి. ఏదిఏమైనా తోకచుక్క భూమి కక్ష్యను దాటదు. భూవాతావరణంలోని రాగానే అదృశ్యమైపోతుంటాయి.