Indian Made Car : స్వ‌దేశీ టెక్నాల‌జీ ఎల‌క్ట్రిక్ తొలి కారు ఇదే! ధర కూడా ఎక్కువే

ఎలక్ట్రిక్ వాహనాల తయారిపై భారత్ దృష్టిపెట్టింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉప్పత్తి చేసి విక్రయించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

Indian Made Car : స్వ‌దేశీ టెక్నాల‌జీ ఎల‌క్ట్రిక్ తొలి కారు ఇదే! ధర కూడా ఎక్కువే

Indian Made Car

Indian Made electric Car : ఎలక్ట్రిక్ వాహనాల తయారిపై భారత్ దృష్టిపెట్టింది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉప్పత్తి చేసి విక్రయించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై ఏ మాత్రం సుంకం తగ్గించలేదు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు విధించే సుంకాన్నే ఎలక్ట్రిక్ కార్లకు విధిస్తున్నారు. దీంతో విదేశీ కంపెనీలు భారత్ లో అమ్మకాలు చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఇక ఇదిలా ఉంటే దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారి కంపెనీలకు భారీగా రాయితీలు ప్రకటిస్తుంది. ఈ తరుణంలోనే కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన తయారివైపు మొగ్గు చూపుతున్నాయి. భారత్ లో దేశీయ తయారి ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక డిమాండ్ ఉండటంతో కొత్త ప్లాంట్లు వెలుస్తున్నాయి.

కార్ల మాన్యుఫాక్చ‌రింగ్ హ‌బ్‌గా భార‌త్‌కు పెట్టింది పేరైనప్పటికి సూప‌ర్ కార్ల నిర్మాణం జోలికి మాత్రం వెళ్ళలేదు. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే దేశంలో సూపర్ కార్ల వినియోగం తక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలి అంటే ప్రపంచ స్థాయి కంపెనీల పోటీని తట్టుకొని నిలబడాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చాలా కంపెనీలు సూపర్ కార్ల తయారికి వెనకడుగు వేశాయి.

అయితే కొన్ని భార‌త్ స్టార్ట‌ప్ సంస్థ‌లు ఆ అభిప్రాయాన్ని తిర‌గ‌రాయాల‌ని భావిస్తున్నాయి. బెంగ‌ళూర్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్.. మీన్ మెట‌ల్ మోటార్స్ అధికారికంగా ప్రొటోటైఫ్ హైప‌ర్ కారు అజానీని ఆవిష్క‌రించింది. ఈ కారు 354 కి.మీ. వేగంతో ప్ర‌యాణిస్తుంద‌ని అంచ‌నా. అదే జ‌రిగితే శ‌ర‌వేగంగా దూసుకెళ్లే ఎల‌క్ట్రిక్ హైప‌ర్ కారు కూడా ఇదే కానుంది. దీని ధ‌ర కూడా కాస్త కాస్ట్‌లీ. సుమారు రూ.89 ల‌క్ష‌లుగా నిర్ణ‌యించాల‌ని ఎంఎంఎం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం.

ఎం-జీరో కాన్సెప్ట్‌తో త‌యారైన ఈ కారు పూర్తిగా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తొలి ఎల‌క్ట్రిక్ కారు. మిడ్ ఇంజిన్ టూ డోర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

అజానీ హైప‌ర్ కారులో అమ‌ర్చే ఎల‌క్ట్రిక్‌ మోటార్ 1000 హెచ్పీ, 1000 ఎన్ఎం టార్చి విడుద‌ల చేసే సామ‌ర్థ్యం సంత‌రించుకుంటుంది. 120 కిలోవాట్ల కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ ప్యాక్ నుంచి ఇంధ‌నం ఉత్ప‌త్తి అవుతుంది. ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే గ‌రిష్ఠంగా 530 కి.మీ. దూరం ప్ర‌యాణించ‌గ‌ల స‌త్తా దీని సొంతం. కేవ‌లం 2.1 సెకన్ల‌లో 60 మైళ్లు (97 కిలోమీట‌ర్ల‌) స్పీడ్‌తో దూసుకెళ్తుందీ హైప‌ర్ కారు. వ‌చ్చే ఏడాది రెండో అర్థ‌భాగంలో విప‌ణిలోకి వ‌స్తుందని భావిస్తున్నారు. మార్కెట్లోకి రానున్న మొదటి
దేశీయ తయారి ఎలక్ట్రిక్ కారు ఇదే.