Oneplus 9 సిరీస్ కొత్త ఫోన్.. ఫస్ట్ లుక్ చూశారా? ఫీచర్లు లీక్..!

  • Published By: sreehari ,Published On : December 13, 2020 / 09:49 PM IST
Oneplus 9 సిరీస్ కొత్త ఫోన్.. ఫస్ట్ లుక్ చూశారా? ఫీచర్లు లీక్..!

First Look at the OnePlus 9 in Person : ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ రాబోతోంది. వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్ లీక్ అయింది. రిలీజ్‌కు ముందే వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. వన్ ప్లస్ 9 సిరీస్ వచ్చే 2021 మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి కొన్ని స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. ఇదివరకే వన్ ప్లస్ 9 డెవలప్ మెంట్ డివైజ్‌కు సంబంధించి ఫొటోలు లీక్ అయ్యాయి.

ఒక వ్యక్తి చేతిలో వన్ ప్లస్ బ్యాక్, ఫ్రంట్ డివైజ్ తో కూడిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఎన్నో లీకులు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా లీకైన వన్ ప్లస్ 9 సిరీస్ ఫొటోల్లో వెనుక వైపు గ్లాసుతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఫోన్ నాలుగు మూలలా గుండ్రని కార్నర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గ్రిప్ కూడా చాలా షార్ప్ గా కనిపిస్తోంది. మెటల్ ప్రేమ్ లుక్ బాగుంది.

వన్ ప్లస్ 8T మాదిరిగా కెమెరా సైజు ఉంది. రెండు మెయిన్ కెమెరాలు కనిపిస్తున్నాయి. టెర్టియరీ కెమెరా కింద ఒకటి ఉంది. 8T ఫోన్ లా బ్లాక్ కాదు.. కలర్ మ్యాచింగ్ బాగుంది. ఇదే కలర్ ఫైనల్ అవుతుందా? లాంచ్ సమయానికి ఏమైనా కలర్ మారుతుందేమో చూడాలి. బ్యాక్ సైడ్ లోగో కాస్తా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కొత్త లోగో లేదా సబ్ బ్రాండ్ లోగో కాకపోవచ్చు. ఇది ప్లేస్ హోల్డర్ లోగా కావొచ్చు. డెవలపింగ్ సమయంలో ఇలాంటి ప్లేస్ హోల్డర్ లోగో ఉంటుంది.

ఇక ఫ్రెంట్ సైడ్ లో చుట్టూ బెజిల్స్ అన్ని కనిపించేలా ఉన్నాయి. టాప్ స్పీకర్ ఉంది. టాప్ లెప్ట్ హోల్ పంచ్ కెమెరా కూడా ఉంది. Alert స్లైడర్ వన్ సైడ్ అమర్చారు. అదికూడా పవర్ బటన్ పైనే ఇచ్చారు. ఫొటోలో కనిపించే చూస్తే.. ఈ డివిజ్ మోడల్ LE2117 (వన్ ప్లస్ 9) మాదిరిగానే కనిపిస్తోంది.

ఈ డివైజ్ లో 8GB RAM, 128GB స్టోరేజీ ఉంటుంది. వన్ ప్లస్ 9 రేంజ్ ఫోన్లలో కొత్త స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ఈ మోడల్ ఫోన్ లో Sony 48MP జంట కెమెరాలు ఉన్నాయి. వన్ ప్లస్ 9 సిరీస్ ఫోన్ ఫీచర్లలో ఏమైనా మార్పులతో వస్తుందా? ఇలానే ఉంటుందో తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.