Whatsapp Live Location : వాట్సాప్ లైవ్ లొకేషన్ ఫీచర్ ఇంతకీ ఎలా వాడాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Live Location : ప్రముఖ మెటా-యాజమాన్యమైన వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం అనేక ఉపయోగకరమైన ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

Whatsapp Live Location : వాట్సాప్ లైవ్ లొకేషన్ ఫీచర్ ఇంతకీ ఎలా వాడాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Whatsapp Live Location _ How to use WhatsApp live location feature_ A step-by-step guide

Whatsapp Live Location : ప్రముఖ మెటా-యాజమాన్యమైన వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం అనేక ఉపయోగకరమైన ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లోని ఇతర కాంటాక్ట్‌లతో యూజర్లు తమ లొకేషన్‌ను షేర్ చేసేందుకు అనుమతించే లైవ్ లొకేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది.

వాట్సాప్ యూజర్లు ఒక యూజర్ లేదా గ్రూపు చాట్‌లో పాల్గొనే వారితో నిర్దిష్ట సమయాన్ని రియల్ టైమ్ లొకేషన్‌ను షేర్ చేసేందుకు కూడా ఎంచుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు మీ లైవ్ లొకేషన్‌ను ఎంతసేపు షేర్ చేయాలో కూడా కంట్రోల్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్లు ఎప్పుడైనా తమ లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడాన్ని కూడా ఆపివేయవచ్చు.

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. మీ లొకేషన్ షేర్ చేసిన యూజర్లు తప్ప మీ లైవ్ లొకేషన్ ఎవరూ చూడలేరు. మీ లైవ్ లొకేషన్‌ని WhatsApp కాంటాక్ట్‌లతో షేర్ చేసే విధానాన్ని తెలుసుకోవచ్చు. అయితే ముందుగా, మీరు మీ డివైజ్‌లో WhatsApp కోసం లొకేషన్ అనుమతులను తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉండాలి.

Read Also : WhatsApp Old Phones : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

అలా చేసేందుకు మీ ఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లాలి. యాప్‌లు, నోటిఫికేషన్‌లపై Tap చేయండి. ఆపై యాప్ పర్మిషన్‌ల తర్వాత అడ్వాన్స్‌డ్‌ (Advanced)పై Click చేయండి. మీ లొకేషన్‌ (Location)పై Tap చేయండి. WhatsApp ముందు టోగుల్‌ని ఆన్ చేయండి.

Whatsapp Live Location _ How to use WhatsApp live location feature_ A step-by-step guide

Whatsapp Live Location _ How to use WhatsApp live location feature

ఒక యూజర్ లేదా గ్రూపు చాట్‌తో లైవ్ లొకేషన్‌ను ఎలా షేర్ చేయాలో చూద్దాం..

* మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* మీరు లొకేషన్‌ను షేర్ చేయాలంటే చాట్‌కి వెళ్లి, అటాచ్‌పై Tap చేయండి.
* మీ లొకేషన్‌పై ట్యాప్ చేసి, ఆపై షేర్ (Live Location)పై Tap చేయండి.
* మీరు మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేసే సమయాన్ని మీరు ఎంచుకోవచ్చు.
* మీరు ఎంచుకున్న సమయం ముగిసిన తర్వాత.. మీ లైవ్ లొకేషన్ షేరింగ్ ఆగిపోతుంది.
* అందులో మీ Text కూడా యాడ్ చేయవచ్చు. చివరగా SEND బటన్‌పై Tap చేయండి.

యూజర్ లేదా గ్రూపు చాట్‌తో లైవ్ లొకేషన్ ఎలా ఆపాలంటే? :
* వాట్సాప్‌ని ఓపెన్ చేసి.. మీరు మీ లొకేషన్‌ను ఆపాలనుకుంటున్న చాట్‌కి వెళ్లండి.
* షేరింగ్ స్టాప్ Tap చేయండి.. ఆపై STOP నొక్కండి.

మరోవైపు.. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ డ్రాయింగ్ టూల్ కోసం టెక్స్ట్ ఎడిటర్‌పై పని చేస్తోంది. WaBetaInfo నివేదిక ప్రకారం.. WhatsApp డ్రాయింగ్ టూల్ రీస్టోర్ చేసిన టెక్స్ట్ ఎడిటర్‌పై పని చేస్తోంది. టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడంతో పాటు ఫాంట్‌ల మధ్య మారడం, టెక్స్ట్ అలైన్‌మెంట్‌లో ఫ్లెక్సిబిలిటీ వంటి కొత్త ఫీచర్‌లను కూడా అందించనుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp New Updates : వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్స్.. ఇకపై యూజర్లు కాల్స్ చేసుకోవడం చాలా ఈజీ తెలుసా?