Flipkart End Sale : ఫ్లిప్‌కార్ట్ ఎండ్ సీజన్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Flipkart End Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 11లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.

Flipkart End Sale : ఫ్లిప్‌కార్ట్ ఎండ్ సీజన్ సేల్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Iphone 13, Iphone 12, Iphone 11 Get Massive Discount During Flipkart End Of Season Sale

Flipkart End Sale : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 11లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. కొత్త iPhone 13 (128GB) వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎండ్ సీజన్ సేల్ సందర్భంగా రూ. 69,999కి అందిస్తోంది. Flipkart సేల్ సమయంలో యూజర్లు iPhone 12, iPhone 11, iPhone SE 2022 వంటి ఇతర iPhone మోడల్‌లపై కూడా తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో Apple iPhone 13 బేస్ 128GB మోడల్ ధర రూ.79,9000గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సమయంలో.. కస్టమర్‌లు 128GB వేరియంట్‌ను రూ.69,999కి కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లు అదనంగా 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. iPhone 13 (256GB స్టోరేజ్) ఆప్షన్ కూడా 79,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక స్టోరేజీ కాన్ఫిగరేషన్ భారత మార్కెట్లో రూ. 89,900కి ప్రారంభం కానుంది. ఐఫోన్ 13 కాంపాక్ట్ వెర్షన్, ఐఫోన్ 13 మినీ ఫోన్లపై ఎండ్ సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ద్వారా రూ. 64,999కి కొనుగోలు చేయవచ్చు.

iPhone 13 mini (256GB వేరియంట్) ధర రూ.73,999కి అందుబాటులో ఉంది. 2021లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన Apple iPhone 12ని ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 53,999కి కొనుగోలు చేయవచ్చు. యూజర్లు 64GB ఇంటర్నల్ స్టోరేజీని పొందవచ్చు. iPhone 12 (128GB) ధర రూ. 58,999కి అందుబాటులో ఉంది. అయితే 256GB వేరియంట్‌ను రూ. 68,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన Apple కొత్త iPhone SE 2022 సేల్ సందర్భంగా రూ.46,900కి కొనుగోలు చేయవచ్చు.

Iphone 13, Iphone 12, Iphone 11 Get Massive Discount During Flipkart End Of Season Sale (1)

Iphone 13, Iphone 12, Iphone 11 Get Massive Discount During Flipkart End Of Season Sale 

కస్టమర్లు 128GB ఇంటర్నల్ స్టోరేజీని పొందవచ్చు. ఐఫోన్ 11పై కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ అందిస్తోంది. ఐఫోన్ మోడల్ రూ. 41,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 11 బేస్ మోడల్ 64GB ఇంటర్నల్ స్టోరేజీని మాత్రమే అందిస్తుంది. 128GB స్టోరేజీ ఆప్షన్ ఐఫోన్ మోడల్ ధర రూ. 46,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ ఆఫర్లలో కస్టమర్‌లు నో-కాస్ట్ EMI ఆఫర్‌లు, గానా ప్లస్/హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఆఫర్‌లు జూన్ 17 వరకు అందుబాటులో ఉంటాయి.

Read Also : Samsung 4K Neo TV : అలెక్సా సపోర్టుతో శాంసంగ్ 4K నియో టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?