iPhone 13 Sale on Flipkart : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డీల్.. తక్కువ ధరకే పొందాలంటే ఇలా చేయండి..!

iPhone 13 Sale on Flipkart : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ అనేక మోడళ్లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే చాలా ఐఫోన్ మోడల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ అందించే ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 13 (iPhone 13)ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

iPhone 13 Sale on Flipkart : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డీల్.. తక్కువ ధరకే పొందాలంటే ఇలా చేయండి..!

iPhone 13 Sale on Flipkart _ iPhone 13 selling under Rs 40,000 on Flipkart, here’s how the deal works

iPhone 13 Sale on Flipkart : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సొంత బ్రాండ్ ఐఫోన్ అనేక మోడళ్లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే చాలా ఐఫోన్ మోడల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఆపిల్ అందించే ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 13 (iPhone 13)ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఐఫోన్ 13పై భారీ డీల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 64,999 వద్ద లిస్ట్ అయింది.

వాస్తవానికి ఈ ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900 కన్నా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. తద్వారా ధర దాదాపు రూ. 20వేలు తగ్గుతుంది. 2021లో iPhone 13 ఫోన్ లాంచ్ అయింది. అయితే, ఇప్పటికీ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం డివైజ్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 13 తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

రూ. 40వేల లోపు ఐఫోన్‌ను ఎలా పొందాలంటే? :

ఆపిల్ ఐఫోన్ 13 (iPhone 13) ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 64,999 వద్ద లిస్ట్ అయింది. ఆపిల్ వెబ్‌సైట్‌ (Apple Website)లో ఐఫోన్ 13 ధర కన్నా చాలా తక్కువగా ఉంది. మీకు ఫెడరల్ బ్యాంక్ కార్డ్ ఉందా? మీరు రూ. 1500 డిస్కౌంట్ ధరతో రూ. 63,499కి పొందవచ్చు. మీ పాత iPhone 11, iPhone 12 ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 22,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డివైజ్ ఎంత కొత్తదైతే అంత ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పవచ్చు. అన్ని డీల్స్, డిస్కౌంట్‌లను కలిపి ఐఫోన్‌ను రూ. 40వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

iPhone 13 Sale on Flipkart _ iPhone 13 selling under Rs 40,000 on Flipkart, here’s how the deal works

iPhone 13 Sale on Flipkart _ iPhone 13 selling under Rs 40,000 on Flipkart, here’s how the deal works

Read Also : iPhone 14 Discount Sale : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో ఆఫర్లు, బెనిఫిట్స్.. ఇదే బెస్ట్ టైమ్.. వెంటనే కొనేసుకోండి..!

iPhone 13 : స్పెసిఫికేషన్‌లు ఇవే :
ఐఫోన్ 13 (25321170) పిక్సెల్‌ల రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 (A15) బయోనిక్ 5nm హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చింది. 128GB, 256GB, 512GB సహా మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బాక్స్ వెలుపల iOS 15లో రన్ అవుతుంది.

ఆప్టిక్స్ పరంగా, iPhone 13 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో పాటు 12MP-ప్రైమరీ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 12-MP లెన్స్ ఉంది. ఆపిల్ iPhoneల బ్యాటరీ స్పెషిఫికేషన్లను వెల్లడించలేదు. iPhone 13 (3240mAh) బ్యాటరీని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. 20W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కొనుగోలు చేసేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Fake iPhone 13 Models : మార్కెట్లో నకిలీ ఐఫోన్ 13 మోడల్స్ సేల్.. ఐఫోన్ కొనే ముందు జాగ్రత్త.. మీ ఫోన్ ఒరిజినల్ అవునో కాదో ఇలా చెక్ చేసుకోండి..!