iPhone 14 Satellite Feature : మంచులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్.. అదేలా సాధ్యపడిందో తెలిస్తే షాకవుతారు..!

iPhone 14 Satellite Feature : మంచులో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఐఫోన్ 14 శాటిలైట్ ఫీచర్.. అదేలా సాధ్యపడిందో తెలిస్తే షాకవుతారు..!

iPhone 14 Satellite Feature Saves life of man stranded in Alaska, here's how

iPhone 14 Satellite Feature : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) ఇటీవల iOS 16.1 వెర్షన్ లాంచ్ అయింది. శాటిలైట్ (Satellite) ద్వారా ఎమర్జెన్సీ SOSను రూపొందించింది. ఈ ఫీచర్ యూజర్లకు సెల్యులార్ నెట్‌వర్క్‌లు లేదా Wi-Fiకి యాక్సెస్ లేనప్పుడు శాటిలైట్ కనెక్టివిటీ (Satellite connectivity)ని ఉపయోగించి అత్యవసర సేవలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 14 మోడల్స్‌ (iPhone 14 Models)లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

అలాస్కా మంచుతో కూడిన పర్వతాలలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ కాపాడింది. MacRumours ప్రకారం.. Noorvik నుంచి Kotzebue వరకు స్నో మిషన్‌ (snow machine)లో ప్రయాణిస్తున్న వ్యక్తి చిక్కుకుపోయాడని అలస్కా స్టేట్ ట్రూపర్స్ హెచ్చరికను అందుకుంది. ఆ వ్యక్తి ఇంటర్నెట్ యాక్సెస్ లేని చల్లని, మారుమూల ప్రదేశంలో చిక్కుకుపోయాడు. ఆ బాధితుడు కనీసం ఫోన్ కాల్స్ కూడా చేయలేకపోయాడు. ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌ శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించాడు.

 

iPhone 14 Satellite Feature Saves life of man stranded in Alaska, here's how

iPhone 14 Satellite Feature Saves life of man stranded in Alaska, here’s how

ఆ శాటిలైట్ ఫీచర్ ద్వారా అత్యవసర SOSకు కనెక్ట్ అయింది. మంచులో ఇరుక్కుపోయాడని సమీప ప్రాంతాల్లోని అధికారులకు తెలియజేసేందుకు తన (iPhone 14)లోని శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను యాక్టివేట్ చేశాడు. అంతే.. ఆ SOS ఫీచర్.. మంచులో వ్యక్తి చిక్కుకుపోయాడంటూ అధికారులు అప్రమత్తం చేసింది. ఆపిల్ షేర్ చేసిన ప్రదేశానికి వెంటనే.. రెస్క్యూ టీమ్‌ మోహరించారు. మంచులో చిక్కుకున్న వ్యక్తిని వెంటనే రక్షించారు. అతను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.

Read Also : iPhone 14 Discount Sale : అమెజాన్ ఇండియాలో iPhone 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి..!

మంచులో చిక్కుకుపోయిన ప్రాంతం రిమోట్, శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులో ఉన్న సరిహద్దులో ఉంది. Apple ప్రకారం.. శాటిలైట్ కనెక్టివిటీ 62 డిగ్రీల అక్షాంశం కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలలో ప్రభావవంతంగా పనిచేయదని కంపెనీ చెబుతోంది. అయితే కెనడా అలాస్కా ఉత్తర భాగాలు, నూర్విక్ కొట్జెబ్యూ 69 డిగ్రీల అక్షాంశానికి దగ్గరగా ఉన్నాయి. శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS కేవలం iPhone 14, iPhone 14 Pro మోడల్‌లలో మాత్రమే పని చేస్తుంది. మీరు సెల్యులార్, Wi-Fi కవరేజ్ లేనప్పుడు అత్యవసర సేవలకు టెక్స్ట్ మెసేజ్ (Text Message) పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

iPhone 14 Satellite Feature Saves life of man stranded in Alaska, here's how

iPhone 14 Satellite Feature Saves life of man stranded in Alaska, here’s how

‘మీరు శాటిలైట్ కనెక్షన్‌ని ఉపయోగించినప్పుడు.. సెల్యులార్ ద్వారా మెసేజ్ పంపడం లేదా స్వీకరించడం కన్నా భిన్నంగా ఉంటుంది. ఆకాశం, హోరిజోన్ లైవ్ వ్యూతో అనువైన పరిస్థితుల్లో, మెసేజ్ పంపడానికి 15 సెకన్లు సమయం పట్టవచ్చు. లేత లేదా మధ్యస్థ ఆకులతో కూడిన చెట్ల కింద అదే మెసేజ్ పంపడానికి ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. అలా కాకుండా గుబురుగా ఉండే చెట్ల ఆకుల కింద ఉన్నట్లయితే లేదా ఇతర అడ్డంకులు కలిగి ఉంటే.. మీరు ఉన్న లొకేషన్ ఉపగ్రహానికి కనెక్ట్ చేయలేకపోవచ్చు.

మీ పరిసరాలు, మీ మెసేజ్ పొడవు, ఉపగ్రహ నెట్‌వర్క్ స్టేటస్ ద్వారా కూడా కనెక్షన్ సమయాలపై ప్రభావం ఉండొచ్చునని Apple బ్లాగ్ పేర్కొంది. ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 14 ప్రో (iphone 1 Pro) యాక్టివేట్ అయిన తర్వాత రెండు ఏళ్ల పాటు శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOS ఉచితంగా పొందవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం ఉత్తర అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇది త్వరలో ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, యూకేకి కూడా విస్తరించాలని ఆపిల్ భావిస్తోంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 14 Pro Models : ఈ హాలీడే సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్ కొనుగోలు కష్టమే.. ఎందుకో తెలుసా?