Jio 599 Plan Offer : జియో యూజర్లకు అదిరే ఆఫర్.. ఈ కొత్త 599 ప్లాన్‌తో రోజుకు రూ. 19కే అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!
Jio 599 Plan Offer : రిలయన్స్ జియో (Reliance Jio) కస్టమర్లకు గుడ్ న్యూస్.. జియో కొత్త 599 ప్లాన్‌తో రోజుకు అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ పొందవచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు.

Jio 599 Plan Offer _ Reliance Jio Rs. 599 postpaid plan offers with unlimited data and unlimited voice calls
Jio 599 Plan Offer : రిలయన్స్ జియో యూజర్లకు అదిరే ఆఫర్.. జియో తమ ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందిస్తోంది. జియో (Jio Users) వినియోగదారులను ఆకర్షించేందుకు మరో సరికొత్త జియో ప్లాన్ ప్రవేశపెట్టింది. అదే.. జియో కొత్త 599 ప్లాన్.. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకు కేవలం రూ.19 చెల్లించి అన్ లిమిటెడ్ 5G, 4G డేటాను పొందవచ్చు. వాస్తవానికి ఈ కొత్త 599 ప్లాన్ (Jio 599 Monthly Plan) నెలవారీ ప్లాన్లతో వచ్చింది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ 4G డేటాను పొందవచ్చు.
అంతేకాదు.. రోజుకు 100 SMS కూడా పొందవచ్చు. అదనంగా జియో యూజర్లు (Jio TV, Jio Cinema, Jio Cloud) వంటి మరెన్నో జియో యాప్ (Jio Apps) సర్వీసులను కూడా ఫ్రీగా పొందవచ్చు. జియో అందించే వెల్ కమ్ ఆఫర్ (Jio Welcome Offer) ద్వారా అర్హత కలిగిన జియో యూజర్లకు అన్‌లిమిటెడ్ (Jio True 5G) డేటాను పొందవచ్చు.
కొత్త జియో 599 ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్ యూజర్లు పోస్టుపెయిడ్‌కు కూడా సులభంగా మారవచ్చు. అదే.. ప్రీమియం సర్వీసులను పొందాలనుకుంటే.. కొత్త జియో యూజర్లకు ఈ కొత్త 599 ప్లాన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారానే రోజుకు కేవలం రూ.19కే అనేక డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.

Jio 599 Plan Offer _ Reliance Jio Rs. 599 postpaid plan offers with unlimited data
మరోవైపు.. రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం ఐపీఎల్ ప్లాన్ల (Jio IPL Plans)ను కూడా ప్రవేశపెట్టింది. జియో కొత్త ఐపీఎల్ ప్లాన్లలో (IPL 2023) భాగంగా రూ. 219, రూ. 999, రూ. 399 వంటి మూడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా జియో ప్రీపెయిడ్ యూజర్లు రోజువారీగా 3GB వరకు డేటాను పొందవచ్చు. అలాగే, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, SMS, 5G డేటాను 40GB వరకు పొందవచ్చు. రూ. 219 ప్లాన్ ద్వారా 14 రోజలు వ్యాలిడిటీ పొందవచ్చు. ఇందులో 2GB డేటా యాడ్ ఆన్ వోచర్ కూడా పొందవచ్చు.
అదే, రూ. 399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఫ్రీగా 6GB డేటా వరకు యాడ్-ఆన్ వోచర్ కూడా పొందవచ్చు. రూ. 999 ప్లాన్ ద్వారా 84 రోజుల వరకు వ్యాలిడిటీ పొందవచ్చు. ఉచితంగా 40GB డేటా యాడ్-ఆన్ వోచర్‌ను కూడా పొందవచ్చు. జియో యూజర్లు సరికొత్త డేటా ప్లాన్లను పొందాలంటే.. My Jio యాప్ లేదా Jio అధికారిక వెబ్ సైట్ విజిట్ చేసి నచ్చిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు.