Lava Blaze Nxt : భారీ బ్యాటరీతో లావా బ్లేజ్ Nxt స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Lava Blaze Nxt : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా (Lava) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ విస్తరించింది. లేటెస్టుగా కంపెనీ లావా బ్లేజ్ Nxt స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది.

Lava Blaze Nxt : భారీ బ్యాటరీతో లావా బ్లేజ్ Nxt స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Lava Blaze Nxt launches with 13MP camera and 5,000mAh battery_ Check price

Lava Blaze Nxt : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా (Lava) భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్ విస్తరించింది. లేటెస్టుగా కంపెనీ లావా బ్లేజ్ Nxt స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ డివైజ్ బడ్జెట్ కేటగిరీ ఫోన్‌గా వచ్చింది. ఈ ఏడాది లాంచ్ అయిన ఒరిజినల్ బ్లేజ్ స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్‌గా వస్తుంది.

Lava Blaze Nxt ధర ఎంతంటే? :
Lava Blaze Nxt స్మార్ట్‌ఫోన్ ధర రూ. 9,299గా ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ డిసెంబర్ 2 నుంచి అమెజాన్, లావా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఆఫర్‌లో లావా అందించే ‘free service at home’ కూడా అందిస్తోంది. వారంటీ వ్యవధిలో కొనుగోలుదారులు తమ ఇంటి వద్దకే స్మార్ట్‌ఫోన్ సర్వీసును పొందవచ్చు.

Lava Blaze Nxt launches with 13MP camera and 5,000mAh battery_ Check price

Lava Blaze Nxt launches with 13MP camera and 5,000mAh battery_ Check price

Lava Blaze Nxt స్పెసిఫికేషన్స్ :
లావా బ్లేజ్ Nxt 2.3GHz వరకు క్లాక్ స్పీడ్‌తో MediaTek Helio G37 ప్రాసెసర్‌తో వస్తుంది. 64GB ఇంటర్నల్ స్టోరేజీతో 4GB RAMని అందిస్తుంది. ఈ ఫోన్ ఇంటర్నల్ మెమరీని 3GB వరకు విస్తరించుకోవచ్చు. ముందు భాగంలో, ఈ డివైజ్ ఎగువన వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 1600×720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల HD+ IPS స్క్రీన్‌ను కలిగి ఉంది.

Lava Blaze Nxt వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. LED ఫ్లాష్‌తో పాటు 13MP AI ప్రధాన కెమెరా + 2MP + VGA ఉంది. ముందు భాగంలో, స్మార్ట్‌ఫోన్ సెల్ఫీల కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో అందుబాటులో ఉన్న కెమెరా ఫీచర్లు డాక్యుమెంట్ ఇంటెలిజెంట్ స్కానింగ్, స్లో మోషన్ వీడియోలు, GIFలు టైమ్ లాప్స్ ఫోటోగ్రఫీతో వచ్చింది. ఈ డివైజ్ 5000mAh బ్యాటరీ సపోర్టు అందిస్తోంది.

Lava Blaze Nxt launches with 13MP camera and 5,000mAh battery_ Check price

Lava Blaze Nxt launches with 13MP camera and 5,000mAh battery_ Check price

గరిష్టంగా 32 గంటల బ్యాటరీ లైఫ్ అందజేస్తుంది. Wi-Fi 802.11 b/g/n/ac, USB టైప్-C, బ్లూటూత్ V5.0, 3.5mm ఆడియో జాక్, 4G లావా బ్లేజ్ Nxtలో కనెక్టివిటీ ఫీచర్లతో గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ, గ్లాస్ రెడ్ ఈ డివైస్ కలర్ వేరియంట్‌లతో వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. సరసమైన ధర, గొప్ప డిజైన్, కెమెరా, వినియోగదారు ఎక్స్‌పీరియన్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో కస్టమర్ల మొత్తం ఎక్స్‌పీరియన్స్ అందించిందని భావిస్తున్నారు. బ్లేజ్ Nxt గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. Nxt-జెన్ యూజర్ల డిమాండ్‌లను తీర్చేందుకు అత్యుత్తమ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా వచ్చింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Realme 10 Pro+ : భారత్‌లో రూ.25 వేల ధర లోపు రియల్‌మి 10ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. డిసెంబర్ 8నే లాంచ్..!