Microsoft Outlook Lite App : బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ వెర్షన్ యాప్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్లలోకి Outlook Lite యాప్ లాంచ్ చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించిన 'లైట్' వెర్షన్ యాప్.

Microsoft Outlook Lite App : బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ వెర్షన్ యాప్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Microsoft Outlook Lite app launched for Android smartphones with low RAM capacity, storage

Microsoft Outlook Lite App : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్లలోకి Outlook Lite యాప్ లాంచ్ చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించిన ‘లైట్’ వెర్షన్ యాప్. అంటే.. తక్కువ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ లైట్ యాప్‌ను యాక్సస్ చేసుకోవచ్చు. ప్రధాన యాప్‌లో కొన్ని ఫీచర్‌లు మాత్రమే ఉండనున్నాయి. 1GB RAM ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో కూడా ఈ లైట్ వెర్షన్ యాప్ పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే Facebook Lite, Instagram Lite వంటి అనేక యాప్‌ల లైట్ వెర్షన్ వంటి ఐఫోన్‌లలో మాత్రం ఈ మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ లైట్ వెర్షన్ యాప్ అందుబాటులో లేదని గుర్తించాలి.

ఆఫీస్, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లు మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ సర్వీస్‌ల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ లైట్ వెర్షన్ యాప్ ప్రయోజనరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం.. ఈ లైట్ యాప్ అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, ఇండియా, మెక్సికో, పెరూ, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తైవాన్, థాయిలాండ్, టర్కీ, వెనిజులాలో అందుబాటులో ఉంది. మైక్రోసాఫ్ట్ తరువాత ఇతర మార్కెట్లలో లాంచ్ చేయనుంది.

Microsoft Outlook Lite app launched for Android smartphones with low RAM capacity, storage

Microsoft Outlook Lite app launched for Android smartphones with low RAM capacity, storage

ఫీచర్లపై ఓ లుక్కేస్తే..

* Outlook Lite యాప్‌లో ఈ-మెయిల్‌లు, క్యాలెండర్, కాంటాక్టులు, మరిన్నింటికి యాక్సెస్‌తో సహా Outlook పనిచేస్తుంది.
* Outlook Lite యాప్ డౌన్‌లోడ్ సైజులో 5MB.. మీ ఫోన్‌లో చాలా తక్కువ స్టోరీజీని మాత్రమే ఉపయోగిస్తుంది.
* 1GB RAM డివైజ్‌లో సహా అన్ని Android డివైజ్‌ల్లో వేగంగా రన్ అయ్యేలా ఆప్టిమైజ్ చేసింది.
* యాప్ బ్యాటరీ లైఫ్ ప్రొటెక్ట్ చేసేందుకు తక్కువ ఫోన్ రీసోర్స్ ఉపయోగిస్తుంది.
* Outlook Lite ప్రపంచవ్యాప్తంగా 2G, 3G నెట్‌వర్క్‌లతో సహా అన్ని నెట్‌వర్క్‌లతో పనిచేస్తుంది.

డిజైన్ పరంగా చూస్తే.. Outlook Lite Android, iOS యూజర్లకు ప్రధానంగా Outlook యాప్ మాదిరిగా కనిపిస్తుంది. దిగువ ట్రేలో ఈ-మెయిల్, క్యాలెండర్‌కు లైవ్ యాక్సస్ అందిస్తుంది. సెర్చ్, మెయిల్ ఫిల్టర్ బటన్‌లు ఎగువ ఎడమవైపుకి లైట్ యాప్‌ యూజర్లు Hotmail, Live, MSN, Microsoft 365, Microsoft Exchange ఆన్‌లైన్ అకౌంట్లతో సైన్ ఇన్ చేయవచ్చు. Outlook Lite ప్రపంచవ్యాప్తంగా తేలికైన మొబైల్ డివైజ్‌లను ఉపయోగించే యూజర్లకు అద్భుతంగా పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Read Also : Microsoft to Netflix : వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న పెద్ద టెక్ కంపెనీలివే..!