Moto E22s in India : రూ.10వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో E22s 4G స్మార్ట్ ఫోన్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Moto E22s in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో Moto E22sని లాంచ్ చేసింది. కంపెనీ నుంచి లేటెస్ట్ బడ్జెట్ 4G ఫోన్ రూ. 10వేల లోపు అందుబాటులో ఉంది. ఆల్‌రౌండర్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు.

Moto E22s in India : రూ.10వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో E22s 4G స్మార్ట్ ఫోన్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

Moto E22s launched in India with 5,000mAh battery and water repellent design under Rs 10,000

Moto E22s in India : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో Moto E22sని లాంచ్ చేసింది. కంపెనీ నుంచి లేటెస్ట్ బడ్జెట్ 4G ఫోన్ రూ. 10వేల లోపు అందుబాటులో ఉంది. ఆల్‌రౌండర్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి ఇదే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. వాటర్ రిపెల్లెట్ డిజైన్‌ను కలిగి ఉంది. తక్కువ ధర విభాగంలో అందుబాటులో లేదు. హుడ్ కింద భారీ 5,000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ సహా మరిన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త Moto E22s (4GB RAM + 64GB) స్టోరేజ్ మోడల్ రూ. 8,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఎకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో సేల్ అందుబాటులో ఉంది. Moto E22s అక్టోబర్ 22 న ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ బడ్జెట్ 4G ఫోన్ గురించి కంపెనీలు ఎంట్రీ-లెవల్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తాయని అనుకోవద్దు.

Moto E22s launched in India with 5,000mAh battery and water repellent design under Rs 10,000

Moto E22s launched in India with 5,000mAh battery and water repellent design

అయితే OEMలు వచ్చే ఏడాది నుంచి దీన్ని ఆఫర్ చేయాలని భావిస్తున్నాయి. Moto E22s సాధారణ 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌తో 500నిట్స్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. డిస్ప్లే HD+ రిజల్యూషన్, వైడ్‌వైన్ L1 సర్టిఫికేషన్‌కు సపోర్టు అందిస్తుంది. ప్యానెల్ 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. IP52 వాటర్ రిపెల్లెంట్ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ బడ్జెట్ ఫోన్ తేలికపాటి నీటి స్ప్లాష్‌లను కూడా తట్టుకోగలదు.

ఫ్రంట్ సైడ్ మార్కెట్‌లోని చాలా ఫోన్‌ల మాదిరిగానే పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ ఉంది. బయోమెట్రిక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది ఎంట్రీ-లెవల్ MediaTek Helio G37 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో వచ్చింది. Motorola లేటెస్ట్ Android OSతో ఈ డివైజ్ రావడం లేదు. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌లో రన్ అవుతుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌ని ఉపయోగించి ఇంటర్నల్ స్టోరేజీ 1TB వరకు విస్తరించుకోవచ్చు.

Moto E22s launched in India with 5,000mAh battery and water repellent design under Rs 10,000

Moto E22s launched in India with 5,000mAh battery and water repellent design

ఫోటోగ్రఫీ కోసం PDAFతో కూడిన 16-MP ప్రైమరీ కెమెరా, డెప్త్ సెన్సింగ్ కోసం 2-MP సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం Motorola ముందు భాగంలో 8-MP కెమెరాను అందించింది. కెమెరా యాప్ పోర్ట్రెయిట్, పనోరమా, నైట్ విజన్, డ్యూయల్ క్యాప్చర్, లైవ్ ఫిల్టర్ వంటి షూటింగ్ మోడ్‌లను అందిస్తుంది.

FHD వీడియోలను 30fps వద్ద రికార్డ్ చేయవచ్చు. 5,000mAh బ్యాటరీతో వచ్చింది. ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. Motorola రిటైల్ బాక్స్‌లో 10W ఛార్జర్‌ను మాత్రమే అందిస్తోంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Motorola 5G Update : మోటోరోలా 5G అప్‌డేట్ ఏయే డివైజ్‌ల్లో వచ్చిందో తెలుసా? అందులో మీ ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకోండి!