Moto E32 Budget : మోటో E32 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Moto E32 Budget : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. Moto E32 ఫోన్.

Moto E32 Budget : మోటో E32 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Motorola launches budget Moto E32 smartphone in India priced at Rs 10,499

Updated On : October 7, 2022 / 6:07 PM IST

Moto E32 Budget : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా (Motorola) భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. Moto E32 ఫోన్. Motorola Moto E32 ఇండియన్ వెర్షన్ యునిసోక్ T606 చిప్‌సెట్‌తో వచ్చింది. మేలో లాంచ్ అయిన యూరోపియన్ మోడల్‌కు ఈ డివైజ్ భిన్నంగా ఉంది.

Moto E32 భారతీయ మోడల్ MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక వేరియంట్‌లో వస్తుంది. దీని ధర రూ.10,499గా ఉంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) అందుబాటులో ఉంది. ఆర్కిటిక్ బ్లూ, ఎకో బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Moto E32 అందించే స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం.

Motorola launches budget Moto E32 smartphone in India priced at Rs 10,499

Motorola launches budget Moto E32 smartphone in India priced at Rs 10,499

Moto E32 స్పెసిఫికేషన్‌లు ఇవే :
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Moto E32 6.5-అంగుళాల IPS LCD ప్యానెల్‌తో 720 x 1,600 పిక్సెల్‌ HD+ రిజల్యూషన్, 90hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. MediaTek Helio G37 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో మోటరోలా My UXతో రన్ అవుతుంది. Motorola రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్టు కూడా ధృవీకరించింది. కెమెరా ముందు భాగంలో Moto E32 50-MP ప్రైమరీ కెమెరా, 2-MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Motorola launches budget Moto E32 smartphone in India priced at Rs 10,499

Motorola launches budget Moto E32 smartphone in India priced at Rs 10,499

సెల్ఫీలు, వీడియో కాల్‌ చేసేందుకు ఈ ఫోన్ ముందు భాగంలో 8-MP కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ బాక్స్‌లో 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. సెక్యూరిటీ పరంగా.. Moto E32 సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది. కొన్ని ఇతర ఫీచర్లు డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS, మైక్రో SD కార్డ్ స్లాట్, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్, IP52 రేటింగ్ కలిగి ఉంది.

Read Also : Moto E32s : భారీ బ్యాటరీతో Moto E32s కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?