Nokia T10 Tablet : 8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా T10 ట్యాబ్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Nokia T10 Tablet : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా బ్రాండ్ లైసెన్సీ నుంచి కొత్త టాబ్లెట్ వచ్చింది. ఈ ఏడాదిలో పోర్ట్‌ఫోలియోను Nokia T10తో నోకియా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ T10 టాబ్లెట్ గత ఏడాదిలో లాంచ్ అయిన నోకియా T20 రిఫ్రెష్ వెర్షన్.

Nokia T10 Tablet : 8 అంగుళాల డిస్‌ప్లేతో నోకియా T10 ట్యాబ్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?

Nokia T10 tablet with 8-inch display launched in India, price starts at Rs 11799

Nokia T10 Tablet : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా బ్రాండ్ లైసెన్సీ నుంచి కొత్త టాబ్లెట్ వచ్చింది. ఈ ఏడాదిలో పోర్ట్‌ఫోలియోను Nokia T10తో నోకియా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ T10 టాబ్లెట్ గత ఏడాదిలో లాంచ్ అయిన నోకియా T20 రిఫ్రెష్ వెర్షన్. డిజైన్ పరంగా చూస్తే.. Nokia T10, T20 రెండూ ఎక్కువ లేదా తక్కువ ఒకేలా కనిపిస్తాయి. గత వెర్షన్ మరింత కాంపాక్ట్ స్క్రీన్‌తో వచ్చింది. ఇప్పుడు 10.4-అంగుళాల డిస్ప్లేకి బదులుగా 8-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. నోకియా T10 మొదటి గ్లోబల్ మార్కెట్లలో జూలైలో లాంచ్ అయింది. నోకియా కాంపాక్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో రియల్‌మే ప్యాడ్ మినీకి పోటీదారుగా మార్కెట్లోకి వచ్చింది.

భారత్‌లో నోకియా T10 ధర :
నోకియా T10 అదే బ్లూ ఫినిషింగ్‌తో వచ్చింది. రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో వస్తుంది. బేస్ 3GB RAM, 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,799 కాగా, 4GB, 64GB స్టోరేజ్ ధర రూ.12,799గా ఉంది. ఈ కొత్త మోడల్ అమెజాన్, అధికారిక నోకియా ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. భారత్‌లో త్వరలో LTE వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Nokia T10 tablet with 8-inch display launched in India, price starts at Rs 11799

Nokia T10 tablet with 8-inch display launched in India, price starts at Rs 11799

నోకియా T10 స్పెసిఫికేషన్స్ :
టాబ్లెట్ బడ్జెట్-ఫ్రెండ్లీ యూజర్లే లక్ష్యంగా స్పెసిఫికేషన్‌లతో వచ్చింది. కాంపాక్ట్ 8-అంగుళాల స్క్రీన్‌తో వచ్చిన ఈ ట్యాబ్ వినియోగదారులను ఆకర్షించనుంది. ఈ టాబ్లెట్‌ మరింత పోర్టబుల్‌గా వస్తుంది. స్క్రీన్ మందపాటి బెజెల్‌లను కలిగి ఉంటుంది. వ్యూ ఎక్స్ పీరియన్స్ ఇబ్బందిగా అనిపించవచ్చు. టాబ్లెట్ Unisoc T606 SoC ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది. నోకియా T10 Android 12L అప్‌డేట్‌ను పొందుతుందా లేదా అనేది HMD గ్లోబల్ క్లారిటీ ఇవ్వలేదు.

పెద్ద స్క్రీన్‌ల కోసం Google రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. వినియోగదారులు క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని పొందవచ్చు. బ్లోట్‌వేర్ యాప్‌లు అందుబాటులో లేవు. 8-అంగుళాల డిస్‌ప్లే 450నిట్స్ బ్రైట్‌నెస్‌తో Full HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. వెనుకవైపు, 8-MP ప్రైమరీ ఉంది. సెల్ఫీల కోసం.. వినియోగదారులు 2-MP సెన్సార్‌ని ఉపయోగించవచ్చు. ఇతర ముఖ్య ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, బయోమెట్రిక్ ఫేస్ అన్‌లాక్, IPX2 రేటింగ్, Google కిడ్స్ స్పేస్, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ ఉన్నాయి. చివరగా, 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,250mAh బ్యాటరీ ఉంది.

Read Also : Best Deals On Laptops : అమెజాన్‌లో ల్యాప్‌టాప్‌లపై 5 బెస్ట్ డీల్స్.. భారీ డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!