iPhone 14 Pro : ఈ ఏడాదిలో ఐఫోన్ 14ప్రో మోడళ్ల అమ్మకాలపైనే ఆపిల్ ఫోకస్.. ఎందుకంటే?
ఆపిల్ 2022 ఏడాది చివరిలో ఐఫోన్ 14 సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లకు సంబంధించి లాంచ్ డేట్ ఇంకా ధృవీకరించలేదు.

Apple Iphone 14, Iphone 14pro Models, Apple Iphone 14 Series
iPhone 14 Pro : ప్రపచం ఐటీ దిగ్గజం ఆపిల్ 2022 ఏడాది చివరిలో ఐఫోన్ 14 సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 మోడళ్లకు సంబంధించి లాంచ్ డేట్ ఇంకా ధృవీకరించలేదు. iPhone 14 సిరీస్ సెప్టెంబర్‌లో అధికారికంగా అందుబాటులోకి వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. Apple iPhone 14 సిరీస్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే నెట్టింట్లో రాబోయే iPhone మోడల్స్ గురించి అనేక విషయాలను వెల్లడించాయి.
ఈ ఏడాదిలో కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం సేల్ వ్యూహాన్ని మార్చుకోనుందని నివేదిక తెలిపింది. TF ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ మింగ్-చి కువో ప్రకారం.. ఆపిల్ ప్రధానంగా సూపర్-ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్‌ను విస్తరించే లక్ష్యంతో హై-ఎండ్ ఐఫోన్ 14 ప్రోని విక్రయించడంపై దృష్టి పెడుతోంది. వన్-టైమ్ ప్లాన్ కాదని, ఐఫోన్ 15 సిరీస్.. అంతకు మించి భవిష్యత్తులో ఐఫోన్ మోడల్‌ల కోసం కంపెనీ వ్యూహాన్ని అనుసరించాలని కంపెనీ భావిస్తోందని కువో చెప్పారు.

Apple Iphone 14, Iphone 14pro Models, Apple Iphone 14 Series
ఈ ఏడాదిలో ప్రో మోడల్‌లు చౌకైన మోడల్లకు భిన్నంగా ఉండనున్నాయి. ఈ ఏడాదిలో ఆపిల్ 4 కొత్త మోడళ్లను లాంచ్ చేయనుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు పిల్ ఆకారపు డిజైన్‌తో రానున్నాయని భావిస్తున్నారు. అయితే, ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌తో సహా చౌకైన మోడల్‌లు నాచ్డ్ డిజైన్‌తో వస్తాయి. మొత్తం 4 మోడల్‌లు A16 బయోనిక్ చిప్సెట్ iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయని చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో WWDC 2022లో ఆపిల్ ప్రకటించింది.
ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్ మినీ మోడల్ బదులుగా ఐఫోన్ 14 మాక్స్‌ను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. 14 మ్యాక్స్ తక్కువ ధర ట్యాగ్‌లో స్పెసిఫికేషన్లను అందిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 14 మ్యాక్స్ డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్లు ముందు భాగంలో సింగిల్ సెన్సార్, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో రానుంది. ఈ ఏడాదిలో ఐఫోన్ మోడల్‌లు పెద్ద సెన్సార్లను అందిస్తాయని భావిస్తున్నారు. ఈ ఫోన్లు తక్కువ వెలుతురులోనూ మంచి ఫోటోలను తీయవచ్చు.
Read Also : iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?