OnePlus Ace 2 Pro Launch : ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వన్‌ప్లస్ Ace 2ప్రో ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఆగస్టు 16నే లాంచ్..!

OnePlus Ace 2 Pro Launch : వన్‌ప్లస్ నుంచి ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వన్‌ప్లస్ Ace 2ప్రో ఫోన్ వస్తోంది.. అదిరిపోయే ఫీచర్లతో ఆగస్టు 16న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.

OnePlus Ace 2 Pro Launch : ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వన్‌ప్లస్ Ace 2ప్రో ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఆగస్టు 16నే లాంచ్..!

OnePlus Ace 2 Pro Confirmed to Offer

OnePlus Ace 2 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) Ace 2 Pro ఫోన్ ఆగష్టు 16న చైనాలో లాంచ్ కానుంది. అంతకంటే ముందు.. ఈ బ్రాండ్ Weibo ద్వారా ఫోన్‌ని స్పెసిఫికేషన్‌లను టీజ్ చేస్తోంది. ఇటీవల, OnePlus OnePlus Ace 2 Pro ఫోన్ RAM, స్టోరేజీ వివరాలను వెల్లడించింది. 24GB వేగవంతమైన ఆన్‌బోర్డ్ మెమరీతో ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ Ace 2 Proలో బయోనిక్ వైబ్రేషన్ సెన్సార్ మోటార్, అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCలో రన్ అవుతుందని ఇప్పటికే నిర్ధారించింది.

Read Also : Flipkart Big Bachat Dhamaal Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు.. డోంట్ మిస్!

వన్‌ప్లస్ (Weibo) ద్వారా OnePlus Ace 2 Pro గురించి మరిన్ని వివరాలను వెల్లడించింది. ఇప్పుడు 24GB LPDDR5x ర్యామ్, 1TB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. SK హైనిక్స్ ప్రొడక్టు చేసిన RAM 54 యాప్‌లను యాక్టివ్‌గా ఉంచుతుంది. 41 యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో 72 గంటల వరకు రన్ చేసేందుకు అనుమతిస్తుంది. రాబోయే OnePlus Ace 2 Pro ప్రపంచంలోనే 24GB ఆన్‌బోర్డ్ RAMతో వచ్చిన ఫస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే, (Red Magic) 8S Pro+ ఫోన్ గత నెలలో 24GB RAM + 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.

OnePlus Ace 2 Pro Confirmed to Offer

OnePlus Ace 2 Pro Launch

గేమింగ్ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ Ace 2 Pro 600mm స్క్వేర్ కన్నా ఎక్కువ వాల్యూమ్‌ను కలిగిన X-యాక్సిస్ లీనియర్ మోటార్‌ను ప్యాక్ చేయనుంది. ఇందులో బయోనిక్ వైబ్రేటింగ్ మోటార్ కూడా ఉంటుంది. ఇంకా, హ్యాండ్‌సెట్ అల్ట్రా-సన్నని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. మునుపటి OnePlus ఫోన్‌ల కన్నా 2cm ఎక్కువగా ఉంటుంది. వన్‌ప్లస్ Ace 2 Pro లాంచ్ చైనాలో ఆగస్టు 16న స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు (12:00pm IST) జరుగుతుంది.

120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 450ppi పిక్సెల్ డెన్సిటీతో 6.74-అంగుళాల OLED 1.5K (1,240×2,772 పిక్సెల్‌లు) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌ను ఉంచడానికి డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను పొందవచ్చు. Snapdragon 8 Gen 2 SoCలో రన్ అవుతుంది. 150W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Read Also : New Ather Launch : ఏథర్ నుంచి సరసమైన ధరకే 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే కొనేవరకు ఆగలేరంతే!