OnePlus Oppo Chargers : భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ల రిటైల్ బాక్సుల్లో ఇక ఛార్జర్ ఉండదు.. ఎందుకో తెలుసా?

OnePlus Oppo Chargers : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), ఆపిల్ (Apple) వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ల రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం ఆపివేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇదే ఫాలో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

OnePlus Oppo Chargers : భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ల రిటైల్ బాక్సుల్లో ఇక ఛార్జర్ ఉండదు.. ఎందుకో తెలుసా?

OnePlus and Oppo tipped to remove chargers from retail boxes in India

OnePlus Oppo Chargers : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung), ఆపిల్ (Apple) వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ల రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం ఆపివేసాయి. రాబోయే రోజుల్లో మరిన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇదే ఫాలో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్, ఒప్పో త్వరలో భారత మార్కెట్లో ఇన్-బాక్స్ ఛార్జర్‌లను అందించడం ఆపివేస్తాయని టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రెండు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ పొందలేదు.

Apple, Google అడాప్టర్‌లను అందించడం లేదు. Samsung ప్రీమియం ఫోన్‌లకు మాత్రమే కాకుండా.. మిడ్ రేంజ్ డివైజ్‌లను కూడా అందించనుంది. ఇప్పటికీ ఛార్జర్‌తో Vivo, iQOO, Xiaomi వంటి కంపెనీలు అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో ఇన్-బాక్స్ ఛార్జర్‌లను అందిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం.. Realme Narzo 50A ప్రైమ్‌ను ఛార్జర్ లేకుండా అందించాలని నిర్ణయించుకుంది.

OnePlus and Oppo tipped to remove chargers from retail boxes in India

OnePlus and Oppo tipped to remove chargers from retail boxes in India

మిగతా డివైజ్‌లు ఛార్జింగ్‌‌తో వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. టెక్ కంపెనీలు ఇన్-బాక్స్ ఛార్జర్‌లను అందించడం లేదు. వాల్ ఛార్జర్‌ను మినహాయిస్తే.. తక్కువ ప్యాకేజింగ్, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ప్రతి రిటైల్ బాక్స్ నుంచి ఛార్జర్‌ను తొలగించడం ద్వారా టెక్ కంపెనీలు దానిపై డబ్బును ఆదా చేయడమే కాకుండా విడిగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తద్వారా అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నాయి.

OnePlus and Oppo tipped to remove chargers from retail boxes in India

OnePlus and Oppo tipped to remove chargers from retail boxes in India

ఈ సంవత్సరం ప్రారంభంలో, ఆపిల్ ఐఫోన్‌లతో ఇయర్‌బడ్‌లు, ఛార్జర్‌లను నిలిపివేయడం ద్వారా 6.5 డాలర్ల బిలియన్లను ఆదా చేస్తుందని నివేదిక వెల్లడించింది. ఐఫోన్‌లను ఛార్జర్‌తో విక్రయించినందుకు Apple ఇటీవల బ్రెజిల్‌లో BRL 100 మిలియన్ల (సుమారు రూ. 150 కోట్లు) జరిమానాను ఎదుర్కొంది. ఫోన్‌లో ఛార్జర్ చాలా ముఖ్యమైన భాగమని, కంపెనీ రిటైల్ బాక్సులో అందించరాదని అక్కడి న్యాయస్థానం పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nothing Ear (Stick) Sale : నథింగ్ ఇయర్ స్టిక్ సేల్ మొదలైందోచ్.. అదిరిపోయే ఆఫర్లు.. డిస్కౌంట్ ధర ఎంతంటే?