OnePlus Nord N300 : వన్‌ప్లస్ నుంచి Nord N300 సిరీస్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. సేల్ ఎప్పటినుంచుంటే?

OnePlus Nord N300 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ అమెరికాలో వన్‌ప్లస్ నోర్డ్ ఎన్300 ((OnePlus Nord N300) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 810 5G చిప్‌సెట్‌తో వస్తుంది 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.

OnePlus Nord N300 : వన్‌ప్లస్ నుంచి Nord N300 సిరీస్ ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. సేల్ ఎప్పటినుంచుంటే?

OnePlus Nord N300 debuts with 90Hz refresh rate display and MediaTek processor

OnePlus Nord N300 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ అమెరికాలో వన్‌ప్లస్ నోర్డ్ ఎన్300 ((OnePlus Nord N300) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 810 5G చిప్‌సెట్‌తో వస్తుంది 6.5-అంగుళాల IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అమెరికాలో మీడియాటెక్ చిప్‌సెట్‌తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే.

OnePlus Nord N200 5G ఫోన్‌ తర్వాత OnePlus Nord N300 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. సరికొత్త Nord ఫోన్ సింగిల్ కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. మిడ్‌నైట్ జేడ్ సాయంతో హ్యాండ్‌సెట్ ధర 228 డాలర్లు (సుమారు రూ. 19,000), 4GB RAMతో వచ్చింది. అమెరికాలో డివైజ్ T-Mobile, Metro ద్వారా అందుబాటులో ఉంటుంది. వచ్చే నెల నవంబర్ 3న సేల్ అందుబాటులోకి రానుంది.

OnePlus Nord N300 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ Nord N300 సెల్ఫీల కోసం ఫ్రంట్ 8MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ 2MP డెప్త్ లెన్స్‌తో 48MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత ఆక్సిజన్ OSతో రన్ అవుతుంది. హ్యాండ్‌సెట్‌లో HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD స్క్రీన్‌తో వచ్చింది. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. OnePlus Nord N300 ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్, ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వన్‌ప్లస్ OnePlus పవర్ బటన్‌పై Nord N300 5Gలో ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను అందిస్తుంది.

OnePlus Nord N300 debuts with 90Hz refresh rate display and MediaTek processor

OnePlus Nord N300 debuts with 90Hz refresh rate display and MediaTek processor

ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీకి సపోర్టు అందిస్తుంది. 33watt ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్‌తో పనిచేస్తుంది. OnePlus భారత్‌లోని OnePlus 10T యూజర్లకు Jio 5G సపోర్ట్ అప్‌డేట్‌ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తయారీదారు లేటెస్ట్ OxygenOS 12 A.10ని రిలీజ్ చేస్తోంది.

ఫర్మ్‌వేర్ వెర్షన్‌ను CPH2413_11_A.10కి అప్‌డేట్ అందిస్తుంది. ఈ డివైజ్‌లో 5G నెట్‌వర్క్‌కు సపోర్టు ఇచ్చేందుకు ఈ అప్‌డేట్ Jioని అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 6వ ఎడిషన్‌లో దేశంలో 5G నెట్‌వర్క్ సర్వీసును అందిస్తుంది. ప్రస్తుతం, జియో, ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌లను దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ప్రారంభించాయి. వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులను ఇంకా ప్రకటించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Chat : మీ పర్సనల్ చాట్ కోల్పోకుండా వాట్సాప్ నంబర్ ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!