WhatsApp Chat : మీ పర్సనల్ చాట్ కోల్పోకుండా వాట్సాప్ నంబర్ ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

WhatsApp Chat : మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెటా యాజమాన్యంలోని WhatsApp ఒక పవర్‌ఫుల్ టూల్‌ అని చెప్పవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మల్టీ ఫీచర్‌లతో వస్తుంది.

WhatsApp Chat : మీ పర్సనల్ చాట్ కోల్పోకుండా వాట్సాప్ నంబర్ ఎలా మార్చుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

Want to change WhatsApp number without losing chat_ Follow these steps

WhatsApp Chat : మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెటా యాజమాన్యంలోని WhatsApp ఒక పవర్‌ఫుల్ టూల్‌ అని చెప్పవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ మెరుగైన ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మల్టీ ఫీచర్‌లతో వస్తుంది. వీటిలో డిజ్‌ప్పియర్ మెసేజ్‌లు, స్టార్ సింబల్ మెసేజ్‌లు, చాట్‌ను పిన్ చేయడం వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే చాట్, ముఖ్యమైన డేటాను కోల్పోకుండా WhatsAppలో మొబైల్ నంబర్లను మార్చగల ఫీచర్ ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని మార్చడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ ప్రాసెస్ ద్వారా వాట్సాప్ చాట్ కోల్పోకుండా చాలా సింపుల్‌గా ఈ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు.

అదే ఫోన్‌లో వాట్సాప్ ఫోన్ నంబర్‌ను ఎలా మార్చాలంటే?

* మీ ఫోన్‌లో WhatsAppని ఓపెన్ చేసి.. WhatsApp Settingsకు వెళ్లండి.
* వాట్సాప్ Account Tap చేయడం.
* ఆపై నెంబర్ ఛేంజ్ ఆప్షన్ వద్ద Tap చేయండి.
* ఇప్పుడు, Next ఆప్షన్ Tap చేయండి.
* మొదటి ఫీల్డ్‌లో మీ పాత ఫోన్ నంబర్‌ను, రెండవ ఫీల్డ్‌లో మీ కొత్త ఫోన్ నంబర్‌ను ఫుల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఎంటర్ చేయండి.
* Next బటన్ Tap చేయండి.
* మీరు మీ కాంటాక్టులను ఇలా ఎంచుకోవచ్చు.
* మీ కాంటాక్టులను Notify చేసేందుకు Turn On చేయండి.

Want to change WhatsApp number without losing chat_ Follow these steps

Want to change WhatsApp number without losing chat_ Follow these steps

* మీరు Notify కూడా ఎంచుకోవచ్చు
* All Contacts, I have chats with or Custom ఎంచుకోవచ్చు.
* మీరు కస్టమ్‌ని ఎంచుకుంటే.. మీ కాంటాక్టుల కోసం సెర్చ్ చేయాలి లేదా ఎంచుకోవాలి.
* ఇప్పుడు Doneపై Tap చేయండి.
* ఇప్పుడు మీరు మీ కొత్త ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయమని ప్రాంప్ట్ పొందుతారు.

మీరు మీ కాంటాక్టులకు Notify ఎంచుకోవాలి. మీరు మీ ఫోన్ నంబర్‌ను మార్చినప్పుడు గ్రూప్ చాట్‌లు ఆటోమాటిక్‌గా Notify ఉండేలా గమనించాలి.

కొత్త ఫోన్‌లో ఫోన్ నంబర్‌ని మార్చుకోవచ్చు :
మీ చాట్ హిస్టరీని పాత డివైజ్ నుంచి కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేందుకు మీ పాత ఫోన్‌లో iCloud లేదా కంప్యూటర్ బ్యాకప్‌ని క్రియేట్ చేయాలి. మీ పాత ఫోన్‌లో మీ ఫోన్ నంబర్‌ని ఛేంజ్ చేసిన తర్వాత, మీ కొత్త ఫోన్‌ని ఉపయోగించి ఈ క్రింది వాటిని ఫాలో అవ్వండి.

* మీ కొత్త ఫోన్‌లో WhatsAppను ఇన్‌స్టాల్ చేయండి.
* మీ డివైజ్‌లో మీ కొత్త ఫోన్ నంబర్‌ను మళ్లీ ఎంటర్ చేయండి.
* మీ బ్యాకప్‌ని Restore చేయండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Happy Diwali 2022 Wishes : మీ స్నేహితులకు స్నాప్‌చాట్ ద్వారా దీపావళి స్టిక్కర్లు, కొత్త AR లెన్స్‌ ఇలా ఈజీగా పంపుకోవచ్చు