పబ్‌జీ రీ లాంచ్ చేస్తున్న దేశాలు.. ఇండియాలో అప్‌డేట్ ఏంటో..

పబ్‌జీ రీ లాంచ్ చేస్తున్న దేశాలు.. ఇండియాలో అప్‌డేట్ ఏంటో..

పాపులర్ స్మార్ట్ ఫోన్ గేమింగ్ యాప్ లలో మెగా క్రేజ్ సంపాదించుకున్న పబ్ జీ ఇండియాలో బ్యాన్ అయింది. మరి మిగిలిన దేశాల పరిస్థితి మీకు తెలుసా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ ప్రకారం.. ఇండియాలో లీగల్ గా ఇండియన్లు ఆడకూడదని ఆంక్షలు విధించింది ప్రభుత్వం. ఈ కారణం వెను ప్రభుత్వం.. తప్పుడు యాక్టివిటీలు జరుగుతున్నాయని.. సెక్యూరిటీపరమైన సమస్యలు వస్తున్నాయంటూ చెప్పింది.

అయితే పబ్ జీ బ్యాన్ చేసిన దేశాల్లో ఇండియా ఒక్కటే లేదు.. మరికొన్ని దేశాలు పలు కారణాలు చూపిస్తూ నిషేదానికి తెరలేపాయి. కాకపోతే అనతికాలంలోనే మళ్లీ పబ్‌జీకి పచ్చ జెండా ఊపేశాయి. ఆ దేశాల గురించి మీకు తెలుసా..

చైనా:
ప్రముఖ గేమింగ్ యాప్ కు చెందిన టెన్సంట్ అఫీషియల్ గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ కు చెందిన చైనీస్ యాప్ పబ్‌జీ. అయితే సొంత దేశంలోనూ దీనికి ఎదురుదెబ్బ తప్పలేదు. హింసా, రక్తపాతం జరుగుతుందనే కారణాలతో అక్కడ పబ్ జీ బ్యాన్ చేశారు. ఆ తర్వాత సపరేట్ వర్షన్ తో మళ్లీ రీ లాంచ్ చేశారు. ఈ గేమ్ పేరు గేమ్ ఫర్ పీస్.

కొరియా;
పబ్‌జీను కొరియా ప్రైవసీ కారణాల రీత్యా బ్యాన్ చేసింది. సింపుల్ రెస్పాన్స్ అనే కంపెనీ పేరుతో ఆ దేశం కోసమే సపరేట్ సర్వర్లతో గేమ్ మొదలుపెట్టింది. పైగా ఇందులో కీలక మార్పులు చేస్తూ.. కొత్త ఫీచర్లు, మ్యాప్స్, స్కిన్స్ యాడ్ చేసి ఒరిజినల్ వర్షన్ల కంటే ఎక్కువ సౌకర్యవంతంగా లాంచ్ చేసింది. ఈ గేమ్ పెద్ద మొత్తంలో ప్లేయర్లను టార్గెట్ చేసుకుని గ్లోబల్ వర్షన్ కు కూడా అనుమతి ఇచ్చింది. అంటే ఏ దేశంనుంచైనా లాగిన్ అయి ఈ గేమ్ ఆడుకోవచ్చన్నమాట.

పాకిస్తాన్:
పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ) సైతం పబ్‌జీ మొబైల్ ను బ్యాన్ చేసింది. గేమ్ పై పలు కంప్లైంట్లు వస్తుండటంతో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. వ్యసనంగా మారడం, సైకాలజికల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపించడం వంటివి జరుగుతుండటంతో నిర్ణయం తీసుకున్నారు. పలు పిటిషన్ల తర్వాత నిషేదాన్ని ఎత్తేసింది ఇస్లామాబాద్ హై కోర్టు.

నేపాల్
నేపాల్ టెలికమ్యూనికేషన్ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. ముందుగా డిస్ట్రిక్ట్ కోర్టులో మెట్రోపొలిటన్ క్రైం డివిజన్ వేసిన పిల్ ఆధారంగా కాట్మండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పబ్ జీని నిషేదించింది. పిల్లల ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందని తీసుకున్న నిర్ణయంతో అలా చేశారు. పలు పిటిషన్ల తర్వాత నేపాల్ సుప్రీం కోర్టు నిషేదం ఎత్తేసింది.

ఇండియా:
పబ్‌జీ కార్పొరేషన్ రీసెంట్‌గా కమ్ బ్యాక్ అనౌన్స్ చేసింది. కాకపోతే ఇండియా కోసం స్పెషల్ వెర్షన్ ను రెడీ చేశారు. ట్రైనింగ్ గ్రౌండ్, క్లాత్‌డ్ క్యారెక్టర్స్ తో పాటు గ్రీన్ ఎఫెక్ట్ లు కూడా యాడ్ చేశారు. ఇలా చేయడం ద్వారా హెల్త్ గేమ్ ప్లే హ్యాబిట్స్ అలవడతాయని కంపెనీ భావిస్తుంది. అంతేకాకుండా యూజర్లు యాప్ మీద ఉండటానికి కూడా టైం లిమిట్ పెడుతుంది.

ఇండియాలో పబ్ జీని తిరిగి తీసుకురావడానికి కంపెనీ బాగా శ్రమిస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న తుది నిర్ణయాన్ని బట్టే ఇండియాలో లాంచింగ్ అప్రూవల్ ఉంటుంది.