Redmi K40 సిరీస్‌లో మూడు 5G ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi K40 సిరీస్‌లో మూడు 5G ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?

redmi k40 pro 5g:షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి కె సిరీస్ నుంచి 5G సపోర్టుతో మరో మూడు వేరియంట్లు వచ్చాయి. లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల నుంచి 5G సపోర్టుతో రెడ్ మి కే40 ఫోన్ సిరీస్ రిలీజ్ అయింది. స్నాప్ డ్రాగన్ 800 సిరీస్ ప్రాసెసర్‌తో Redmi K40 సిరీస్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన సెల్ఫీ కెమెరాతో రెడ్ మి కె40 సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.

AMOLED 120Hz స్ర్కీన్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, డ్యుయల్ స్టీయెరో స్పీకర్లను అందిస్తోంది. రెడ్ మి K40 ఫోన్ ప్రారంభ ధరతో చైనాలో CNY 1999 (రూ.22,460)గా ఉంది. భారత మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ప్రస్తుత మార్కెట్లో రియల్ మి X60 5G, iPhone 12, Oppo Reno 5 Pro+ బ్రాండ్ ఫోన్లతో పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఇంతకీ ఈ రెండు వేరియంట్లలో ఏయే ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
రెడ్ మి నుంచి మూడు కె40 వేరియంట్లలో Redmi K40, Redmi K40pro, Redmi K40Pro+ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మూడు ఫోన్లలో ప్రాసెసర్, కెమెరాలలో మాత్రమే తేడా ఉంది. మిగిలిన ఫీచర్లు అన్నీ ఒకేలా ఉన్నాయి.

– 6.67 అంగుళాల AMOLED E4 ట్రూటోన్ డిస్‌ప్లే

– ఫుల్ HD+ రెజుల్యుషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+

– 1,300nits, 360Hz టచ్ శాంపిలింగ్ రేట్

– పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్, 2mm

– క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 7nm ప్రాసెస్

– స్నాప్ డ్రాగన్ 888చిప్ సెట్ ( ప్రో వెర్షన్లు)

– 5nm, ఫ్లాగ్ షిప్ 5G చిప్

– డ్యుయల్ స్టీయెరో స్పీకర్లు, డాల్ బై అట్మోస్ సౌండ్

– Wi-Fi 6 సపోర్ట్, 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజీ ఆప్షన్

– 48MP AI ప్రైమరీ కెమరా, 5MP కెమెరా, 8MP సెన్సార్

– 64MP సోనీ IMX686 మెయిన్ కెమెరా

– 108MP శాంసంగ్ HM2 ప్రైమరీ సెన్సార్ (Pro+)

– 4,520mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జర్

– బ్రైట్ బ్లాక్, డ్రీమ్ ల్యాండ్, సన్నీ స్నో

– ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

ధర ఎంతంటే? :
Redmi K40 :

– 6GB RAM + 128 GB స్టోరేజీ మోడల్ ధర రూ. CNY 1999 (రూ.22,640)

– 8GB RAM + 128GB స్టోరేజీ వెర్షన్ CNY 2,199 (రూ.24,710)

– 8GB RAM + 256GB స్టోరేజీ కాన్ఫిగరేషన్ CNY 2,499, (రూ.28,090)

Redmi K40 Pro :

– 6GB RAM + 128GB స్టోరేజీ ధర CNY 2,799 (రూ.31,460)

– 8GB RAM + 128GB స్టోరేజీ ధర CNY 2,999 (రూ.33,710)

– 8GB RAM + 256GB స్టోరేజీ ధర CNY 3,299 (రూ.37,080)

Redmi K40 Pro+ :

– CNY 3,699 ధర రూ.41,570