WhatsApp Admins : వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక అడ్మిన్లు.. కమ్యూనిటీ లిస్టులో నిర్దిష్ట గ్రూపులను హైడ్ చేయొచ్చు..!

ఈ ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌ల జాబితా నుంచి నిర్దిష్ట గ్రూప్ చాట్‌లను హైడ్ చేసేందుకు కమ్యూనిటీ అడ్మిన్లను అనుమతిస్తుంది.

WhatsApp Admins : వాట్సాప్‌లో త్వరలో సరికొత్త ప్రైవసీ ఫీచర్.. ఇక అడ్మిన్లు.. కమ్యూనిటీ లిస్టులో నిర్దిష్ట గ్రూపులను హైడ్ చేయొచ్చు..!

WhatsApp may soon allow admins to hide specific groups

Updated On : April 24, 2024 / 6:59 PM IST

WhatsApp Admins : వాట్సాప్ యూజర్ల ప్రైవసీ కోసం మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రత్యేకించి వాట్సాప్ గ్రూపు సభ్యుల కోసం అందుబాటులోకి రానుంది. యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత మెరుగుపరచేందుకు వాట్సాప్ అనేక కొత్త ఫీచర్‌లపై పనిచేస్తోంది.

Read Also : Realme Narzo 70 5G Series : రియల్‌‌మి నుంచి 2 సరికొత్త నార్జో 70 5జీ సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్, ధర కూడా చాలా తక్కువే!

ఈ అప్‌డేట్‌లకు అనుగుణంగా, మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కమ్యూనిటీ గ్రూప్ చాట్‌ల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టే పనిలో పడింది. ఈ ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌ల జాబితా నుంచి నిర్దిష్ట గ్రూప్ చాట్‌లను హైడ్ చేసేందుకు కమ్యూనిటీ అడ్మిన్లను అనుమతిస్తుంది.

లేటెస్ట్ వాట్సాప్ బీటాలో టెస్టింగ్ :
నివేదిక ప్రకారం.. ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.9.27 లేటెస్ట్ వాట్సాప్ బీటాలో టెస్టింగ్ చేస్తోంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ కానుంది. ఒకసారి ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ అడ్మిన్‌లు వారి గ్రూప్ చాట్‌లకు కనిపించకుండా కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది. నిర్దిష్ట గ్రూపులను హైడ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఇందులో ఇన్వైట్ చేసిన గ్రూపు సభ్యులు మాత్రమే ఈ హైడ్ గ్రూపు చాట్‌లను గుర్తించగలరు. ఆయా గ్రూపుల్లో జాయిన్ కాగలరు.

అతి త్వరలో అందరికి :
ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులు మొత్తం కమ్యూనిటీకి కనిపించకుండా నిర్దిష్ట గ్రూపులను హైడ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ అడ్మిన్‌లకు మెరుగైన ప్రైవసీ, కంట్రోలింగ్ అందిస్తుంది. ఇలా హైడ్ చేసిన గ్రూపు చాట్‌లు సాధారణ కమ్యూనిటీలో అనవసరమైన అయోమయాన్ని కలిగించకుండా నివారిస్తుంది. ఈ ఫీచర్ లభ్యత విషయానికొస్తే.. వాట్సాప్ బీటా టెస్టింగ్ తర్వాత యాప్ వచ్చే అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను రిలీజ్ చేయాలని యోచిస్తోంది.

Read Also : Bha Shoe Sizing System : భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్.. ఇదే మన నెంబర్!