Xiaomi Redmi Phones : రెడ్‌మి నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Xiaomi Redmi Phones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి రెండు కొత్త బడ్జెట్ ఫోన్‌లను (Redmi Prime 5G, Redmi A1) లాంచ్ చేయనుంది. Redmi 11 Prime స్మార్ట్‌ఫోన్ 4G, 5G వేరియంట్‌లను కంపెనీ ఆవిష్కరించనుంది.

Xiaomi Redmi Phones : రెడ్‌మి నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు వస్తున్నాయి.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Redmi Prime 11 5G, Redmi A1 India launch today _ Price, Specifications and more

Xiaomi Redmi Phones : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్‌మి (Redmi) నుంచి భారత మార్కెట్లోకి రెండు కొత్త బడ్జెట్ ఫోన్‌లను (Redmi Prime 5G, Redmi A1) లాంచ్ చేయనుంది. Redmi 11 Prime స్మార్ట్‌ఫోన్ 4G, 5G వేరియంట్‌లను కంపెనీ లాంచ్ చేయనుంది. గతేడాది రిలీజ్ అయిన రెడ్‌మి 10 ప్రైమ్‌ (Redmi 10 Prime)ను ఈ స్మార్ట్‌ఫోన్ ప్రైమ్‌తో పాటు, Redmi A1ని ఎంట్రీ లెవల్ ఫోన్‌గా ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌కు సంబంధించి కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Redmi Prime 11 5G Redmi A1 : ధర ఎంతంటే? :
రెడ్‌మీ ప్రైమ్ 11 5G ధర రూ. 15వేల లోపు ఉండవచ్చనని అంచనా వేస్తున్నారు. అయితే, Redmi A1 ధర రూ. 10వేల లోపు ఉండవచ్చని అంచనా. Xiaomi ఇంకా రెండు ఫోన్‌ల ధరను నిర్ధారించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

Redmi Prime 11 5G, Redmi A1 India launch today _ Price, Specifications and more

Redmi Prime 11 5G, Redmi A1 India launch today _ Price, Specifications and more

Redmi Prime 11 5G, Redmi A1: స్పెషిఫికేషన్లు ఇవే :
Redmi A1 స్మార్ట్ ఫోన్ ప్రీమియం, మిడ్-రేంజ్ ఫోన్‌ల మాదిరిగానే ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌తో రానుంది. రెండు పెద్ద కెమెరా సెన్సార్లతో వెనుక భాగంలో పిల్-షేప్ కెమెరా ఉండనుంది. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఇతర Xiaomi డివైజ్ వలె డిజైన్ ఉండనుంది. బ్లూ, గ్రీన్ కలర్ సహా పాస్టెల్ కలర్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. డిస్‌ప్లే వాటర్‌డ్రాప్ నాచ్‌ని కూడా కలిగి ఉంది. స్పెక్స్ విషయానికొస్తే.. Redmi A1 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుక భాగంలో రెండు కెమెరా సెన్సార్లను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా ఫ్రంట్ సైడ్ నాచ్ కూడా ఉంది.

Redmi Prime 11 5G, Redmi A1 India launch today _ Price, Specifications and more

Redmi Prime 11 5G, Redmi A1 India launch today _ Price, Specifications and more

Redmi Prime 11 5G ప్రకారం.. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoCతో పాటు 6GB RAM, 128GB స్టోరేజ్‌తో అందించనున్నట్టు అంచనా వేశారు. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావించారు. ఈ ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

కెమెరా విభాగంలో, రెడ్‌మి 11 ప్రైమ్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 2MP డెప్త్ సెన్సార్‌తో పాటు 50MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ రెడ్‌మి ప్రైమ్ 11 5G సెల్ఫీలు, వీడియో చాట్‌లతో ముందు భాగంలో 5-MP స్నాపర్‌ని కలిగి ఉంటుంది. రెడ్‌మి ప్రైమ్ 10 కన్నా కొత్త ఫోన్ అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also : Redmi Note 11 SE : 64MP ట్రిపుల్ కెమెరాలతో రెడ్‌మి నోట్ 11 SE వచ్చేసింది.. ధర ఎంతంటే?