Vi Republic Day 2023 Offer : వోడాఫోన్ ఐడియా యూజర్లకు రిపబ్లిక్ డే 2023 ఆఫర్.. ఈ ప్లాన్లపై ఉచితంగా 5G డేటా పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

Vi Republic Day 2023 Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ప్రీపెయిడ్ కస్టమర్‌లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ వేడుకలో భాగంగా, ప్రీపెయిడ్ ప్లాన్లపై వినియోగదారులకు ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అందిస్తోంది.

Vi Republic Day 2023 Offer : వోడాఫోన్ ఐడియా యూజర్లకు రిపబ్లిక్ డే 2023 ఆఫర్.. ఈ ప్లాన్లపై ఉచితంగా 5G డేటా పొందవచ్చు.. పూర్తి వివరాలు మీకోసం..!

Republic Day 2023 Offer _ Vodafone-idea is offering free 5GB data to users, Check Details

Vi Republic Day 2023 Offer : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ ప్రీపెయిడ్ కస్టమర్‌లకు సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ వేడుకలో భాగంగా, ప్రీపెయిడ్ ప్లాన్లపై వినియోగదారులకు ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అందిస్తోంది. అదనపు ఖర్చు లేకుండా 5GB లేదా 2GB డేటాను వినియోగించుకోవచ్చు. రూ. 299 కన్నా ఎక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అదనపు డేటాను యాక్సస్ చేసుకోవచ్చు. రూ. 199, రూ. 299 మధ్య ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగిన కస్టమర్‌లు అదనంగా 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా బెనిఫిట్స్ పొందాలంటే వినియోగదారులు Vi యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కొత్త Vi ఆఫర్ ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది.

వోడాఫోన్ ఐడియా (Vi) అధికారిక వెబ్‌సైట్ అదనపు ఇంటర్నెట్ డేటా 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందని పేర్కొంది. రూ. 299 ప్లాన్, రూ. 479 ప్లాన్, రూ. 719 వంటి కొన్ని బెస్ట్ ప్లాన్‌లను టెల్కోలు సిఫార్సు చేస్తున్నాయి. మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్లను అందిస్తాయి. కానీ ప్లాన్ వ్యాలిడిటీ, ఇంటర్నెట్ డేటాను వేర్వేరుగా అందిస్తున్నాయి. రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా అందిస్తుంది.

Read Also : Best Plans of 2023 : 2023లో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బెస్ట్ ప్లాన్లు ఇవే.. ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాదిపాటు ఎంజాయ్ చేయొచ్చు!

అదనపు డేటా బెనిఫిట్స్ పొందాలంటే 12 AM నుంచి 6 AM మధ్య ఫ్రీ డేటా, వారాంతపు డేటా, Vi సినిమాలు, టీవీకి యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతి నెల 2GB వరకు ఉచిత బ్యాకప్ డేటా పొందవచ్చు. వోడాఫోన్ ఐడియా వినియోగదారులు 121249కి కాల్ చేయాలి లేదా Vi యాప్ ద్వారా అప్లయ్ చేయాలి. రూ. 479, రూ. 719 ప్లాన్‌లు ఒకే డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. మొదటిది 56 రోజుల వ్యాలిడిటీతో మరొకటి రూ. 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Republic Day 2023 Offer _ Vodafone-idea is offering free 5GB data to users, Check Details

Republic Day 2023 Offer _ Vodafone-idea is offering free 5GB data to users, Check Details

వోడాఫోన్ ఐడియా (Vi) కూడా రూ. 209 టారిఫ్‌తో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, 4GB డేటాను అందిస్తుంది. యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే యూజర్లు 2GB అదనపు డేటాను పొందవచ్చు. అదనపు ఇంటర్నెట్ డేటా పొందాలంటే Vi యూజర్లు 5G స్పీడ్ పొందవచ్చు. Vi ఇంకా యూజర్లకు 5G సర్వీసులను అందించలేదు. అయితే Airtel, Jio 5G సర్వీసులు అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇటీవల, టెల్కో బ్లాగ్ పోస్ట్‌ను అందించింది. 5G సర్వీసులను యాక్సెస్ చేసేందుకు మొబైల్ డివైజ్ యాక్సస్ చేయాల్సి ఉంటుంది. అయితే, కొత్త 5G SIM అవసరం లేదు. మీరు 5G హ్యాండ్‌సెట్‌కి అప్‌డేట్ చేసిన తర్వాత, మీ మొబైల్ ఫోన్‌లలో 5Gని ఉపయోగించవచ్చు. మీ ప్రస్తుత 4G SIM కార్డ్ సరిపోతుందని పోస్ట్‌లో తెలిపింది. దేశంలో 5G సర్వీసులను వినియోగదారులు ఎప్పుడు పొందవచ్చు అనేది కంపెనీ స్పష్టం చేయలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vodafone Idea New Plans : వోడాఫోన్ ఐడియా నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఇందులో ఏ ప్లాన్ బెటర్ అంటే?