Samsung 4K Neo TV : అలెక్సా సపోర్టుతో శాంసంగ్ 4K నియో టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung 4K Neo TV : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో కొత్త 4K స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సరసమైన ధరకే PurColor టెక్నాలజీతో అందిస్తోంది.

Samsung 4K Neo TV : అలెక్సా సపోర్టుతో శాంసంగ్ 4K నియో టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Samsung Crystal 4k Neo Tv With Alexa Support, Smart Features Launched In India

Samsung 4K Neo TV : సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లో కొత్త 4K స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సరసమైన ధరకే PurColor టెక్నాలజీతో అందిస్తోంది. ఈ కొత్త Samsung Crystal 4K Neo TV 43-అంగుళాల సైజులో ఉంటుంది. HDR10+తో 4K ప్యానెల్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ సరసమైన 4K TVలలో ఒకటి.. అందుకే OLED ప్యానెల్‌కు బదులుగా సాధారణ LEDని మాత్రమే అందిస్తోంది. Samsung Crystal 4K Neo TV 3840×2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 50Hz, HDR10+, వన్ బిలియన్ ట్రూ కలర్స్ టెక్నాలజీ రిఫ్రెష్ రేట్‌తో ప్యానెల్‌ను అందిస్తుంది.

Samsung క్రిస్టల్ 4K ప్రాసెసర్ ఆధారంగా రన్ అవుతుంది. ప్రస్తుతం Samsung కేవలం 43-అంగుళాల మోడల్‌ను మాత్రమే విక్రయిస్తోంది. కానీ 55-అంగుళాల వెర్షన్ కూడా ఉంది. దీని ధర ఎంత అనేది శాంసంగ్ రివీల్ చేయలేదు. Samsung కొత్త టీవీ మోషన్ Xcelerator ఫీచర్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. యాక్షన్ సీక్వెన్స్‌లు సున్నితంగా కనిపించేలా చేయడానికి ఆటో ప్రేమ్‌లను యాడ్ చేసింది. ఈ ఫీచర్ గేమర్‌లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. Samsung క్రిస్టల్ 4K నియో టీవీని ఆటో గేమ్ మోడ్‌తో అమర్చారు.

Samsung Crystal 4k Neo Tv With Alexa Support, Smart Features Launched In India (2)

Samsung Crystal 4k Neo Tv With Alexa Support, Smart Features Launched In India 

Dolby Digital Plus ద్వారా ట్యూన్ 20W స్పీకర్‌లతో Samsung Crystal 4K Neo TV సౌండ్ సిస్టమ్ అద్భుతంగా వస్తుంది. స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్ టీవీ సౌండ్‌ని కంటెంట్‌కు అనుగుణంగా అడ్జెస్ట్ అవుతుంది. వాల్యూమ్‌ను మాన్యువల్‌గా అడ్జెస్ట్ చేయడానికి రిమోట్ కంట్రోల్‌ని మీ చేతిలో ఎప్పుడూ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సరౌండ్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే.. టీవీ స్పీకర్‌లు, సౌండ్‌బార్ నుంచి సౌండ్‌ని సింక్రొనైజ్ చేసే Q-సింఫనీ ఫీచర్ కూడా ఉంది. టీవీలో మ్యూజిక్ ప్లేయర్ యాప్ ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది, కానీ మీరు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లో ఉంటే.. Spotify, Gaana వంటి అన్ని ప్రధాన యాప్‌లు అందుబాటులో ఉంటాయి. Samsung Crystal 4K Neo TV YouTube, Netflix, Amazon Prime వీడియో, YuppTV, ZEE5, Disney+ Hotstar, Voot ALT బాలాజీ వంటి యాప్‌లతో ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. PC మోడ్‌కు సపోర్టు కూడా అందిస్తుంది. HDMI పోర్ట్‌ల ద్వారా మీ PCని కనెక్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.

నియో టీవీ ధర ఎంతంటే? :
Samsung Crystal 4K Neo TV ధర రూ.35,990గా ఉంది. Amazon India, Flipkart, Samsung ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీ బడ్జెట్ రేంజ్ లో ఉన్నట్టయితే.. వెంటేనే శాంసంగ్ Crystal 4K Neo TV కొనుగోలు చేయొచ్చు.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. ఇక ఆండ్రాయిడ్ టు ఐఫోన్ చాట్ ట్రాన్స్‌ఫర్ ఈజీ..!