Samsung New Mouse : ఎక్కువసేపు పనిచేసేవారంటే ఈ మౌస్‌కు నచ్చదు.. పట్టుకుంటే పారిపోతుంది..!

Samsung New Mouse : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ వినియోగదారుల కోసం కొత్త మౌస్ (New Mouse) వచ్చింది. ఎక్కువ సేపు పనిచేయకుండా నివారించేందుకు ఈ కొత్త మౌస్ అందుబాటులోకి వచ్చింది.

Samsung New Mouse : ఎక్కువసేపు పనిచేసేవారంటే ఈ మౌస్‌కు నచ్చదు.. పట్టుకుంటే పారిపోతుంది..!

Samsung’s new mouse will run away if you start working too much

Updated On : September 7, 2022 / 5:51 PM IST

Samsung New Mouse : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ వినియోగదారుల కోసం కొత్త మౌస్ (New Mouse) వచ్చింది. ఎక్కువ సేపు పనిచేయకుండా నివారించేందుకు ఈ కొత్త మౌస్ అందుబాటులోకి వచ్చింది. అధిక ఒత్తిడితో పనిచేసే వినియోగదారులకు విశ్రాంతినిచ్చేందుకు శాంసంగ్ ఈ కొత్త మౌస్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. శాంసంగ్ కొత్త కంప్యూటర్ మౌస్‌తో ముందుకు వచ్చింది. శాంసంగ్ వినియోగదారులు ఎవరూ ఎక్కువ పనిచేయదు. అయితే అన్ని కంప్యూటర్ మాస్‌లా ఇది సాధారణ మౌస్ కాదు.. కానీ, కంప్యూటర్ యూజర్లు ఎక్కువగా పని చేయకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.

Samsung’s new mouse will run away if you start working too much

Samsung’s new mouse will run away if you start working too much

శాంసంగ్ బ్యాలెన్స్ మౌస్ (Samsung Balance Mouse) అని కూడా పిలుస్తారు. మీరు నిర్దేశించిన సమయం కన్నా అధికంగా పనిచేస్తే మాత్రం ఈ మౌస్ మీ పనిసమయాన్ని గుర్తిస్తుంది. వెంటనే క్షణంలో మీ డెస్క్ నుంచి దూరంగా జరిగిపోతుంది. ఈ Samsung కంప్యూటర్ మౌస్ చూడటానికి అచ్చం నిజమైన మౌస్ వలె పనిచేయడమే కాదు. ఒకదాని మాదిరిగానే కనిపిస్తుంది. అయితే యాడ్ ఏజెన్సీ సాయంతో ఈ కాన్సెప్ట్ మౌస్‌ను రూపొందించారు.

Samsung బ్యాలెన్స్ మౌస్ వీడియో Samsung కొరియన్ YouTube ఛానెల్‌లో పోస్ట్ చేసింది. కొరియాలో పనిసమయాన్ని మెరుగుపరిచేందుకు బ్యాలెన్స్ మౌస్‌ను రూపొందించారు. శాంసంగ్ వీడియోలో మెజారిటీ ఆఫీసుల్లో ఉద్యోగులు సమయానికి పని నుంచి బయటపడేందుకు వెనుకాడుతున్నారని పేర్కొంది. చేయాల్సిన పని పెండింగ్‌లో ఉండటంతో షిఫ్ట్ సమయం దాటినా ఇంటికి వెళ్లేందుకు ఆలోచిస్తుంటారు. ఆ సమయంలో చేయాల్సిన పూర్తి చేయడానికి విపరీతమైన ఒత్తిడికి గురవుతారు.

Samsung’s new mouse will run away if you start working too much

Samsung’s new mouse will run away if you start working too much

కొన్నిసార్లు అధిక పనితో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే శాంసంగ్ అధి పని ఒత్తిడి సమస్యను అధిగమించేందుకు ఈ డివైజ్ సృష్టించినట్లు శాంసంగ్ వీడియోలో పేర్కొంది. ఇది సాధారణ మౌస్ కాదని, అవసరమైన దానికంటే ఎక్కువ పని చేయకుండా ఉద్యోగులను అడ్డుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. ఓవర్‌టైమ్ పని చేస్తున్నప్పుడు ఈ కొత్త మౌస్ వెంటనే అలర్ట్ అవుతుంది.

Samsung’s new mouse will run away if you start working too much

Samsung’s new mouse will run away if you start working too much

మీ చేతి కదలికలను గుర్తిస్తుంది. మీ చేతి కదలికల ద్వారా మీరు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో గుర్తిస్తుంది. వెంటనే మౌస్ వీల్స్ బయటకు వచ్చేస్తాయని శాంసంగ్ వీడియోలో పేర్కొంది. మౌస్ మీ డెస్క్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు దానిని పట్టుకోవచ్చని అనుకుంటే.. అది నిజంగా తప్పు అని శాంసంగ్ వీడియో పేర్కొంది. ఎందుకంటే మౌస్ చాలా వేగంగా కదులుతుంది. మీరు డివైజ్ పట్టుకోగలిగినప్పటికీ.. మౌస్ ప్రధాన భాగం బయటకు వస్తుంది. బ్యాలెన్స్ మౌస్‌ ద్వారా ఉద్యోగులు పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలనేది శాంసంగ్ ఉద్దేశంగా పేర్కొంది.

Read Also : Amazon Great Indian Festival 2022 : అమెజాన్ ఫెస్టివల్ సీజన్‌ సేల్.. ఈ టిప్స్& ట్రిక్స్ పాటిస్తే భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.. డోంట్ మిస్..!