టెక్ టిప్స్ : ఐఫోన్.. ‘ఆపిల్ మ్యూజిక్’ ఆపేయాలంటే?

మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్ లో ఆపిల్ మ్యూజిక్ యాప్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసు ఉందా?

  • Published By: sreehari ,Published On : April 26, 2019 / 12:17 PM IST
టెక్ టిప్స్ : ఐఫోన్.. ‘ఆపిల్ మ్యూజిక్’ ఆపేయాలంటే?

మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్ లో ఆపిల్ మ్యూజిక్ యాప్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసు ఉందా?

మీరు Apple iPhone వాడుతున్నారా? మీ ఫోన్ లో ఆపిల్ మ్యూజిక్ యాప్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసు ఉందా? ఉచితంగా మూడు నెలల పాటు అందించే ఈ మ్యూజిక్ సబ్ స్ర్కిప్షన్.. ఆ తర్వాత నెలకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి అయితే నెలకు రూ.99 చెల్లించాలి.

ఫ్యామిలీ ప్యాకేజీ అయితే నెలకు రూ.149 చెల్లించాలి. ఏడాదికి అయితే రూ.1, 188వరకు చెల్లించాల్సి ఉంటుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు అంటే ఇష్టపడని వారుండరు. Apple Music యాప్ ద్వారా నచ్చిన మ్యూజిక్ ను ఎంజాయ్ చేయొచ్చు.  కానీ, కొంతమంది ఐఫోన్ కొత్త యూజర్లు ఈ ఆపిల్ మ్యూజిక్ సర్వీసును క్యాన్సిల్ చేయాలనుకుంటారు. 

మూడు నెలల పాటు ఉచితంగా మ్యూజిక్ సర్వీసును వినియోగించుకుని ఆ తర్వాత ప్రీమియం చెల్లించడం ఇష్టం లేక సర్వీసును నిలిపివేయాలని భావిస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్ లా కాదు.. ఐఫోన్ లోని యాప్స్ కంట్రోల్ చేయడానికి. ఐఓఎస్ ఫోన్లలో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఐఫోన్ లో Apple Music యాప్ సబ్ స్ర్కిప్షన్ డీయాక్టివేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి చాలు.. 

1. ఐఫోన్ డివైజ్ లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి.. మీ ప్రొఫైల్ ఇమేజ్ పై ట్యాప్ చేయండి
2. ఐట్యూన్స్ అండ్ యాప్ స్టోర్ పై క్లిక్ చేయండి.
3. Apple ID.. స్ర్కీన్ టాప్ లో కనిపిస్తుంది. ఆపిల్ ఐడీ ఆప్షన్ వ్యూ క్లిక్ చేయండి.
4. ఆ పేజీలో కిందిభాగంలో సబ్ స్ర్కిప్షన్స్ పై క్లిక్ చేయండి. యాక్టీవ్, ఎక్స్ పెయిర్ సబ్ స్ర్కిప్షన్లు ఉంటాయి.
5. ఆపిల్ మ్యూజిక్ లేదా, ఇతర ఏ సర్వీసును అనుకోకుండా యాక్టివేట్ చేసుకున్నారేమో చెక్ చేయండి.
6. ఫ్యామిలీ ప్యాక్.. నెలవారీ నుంచి ఏడాది సబ్ స్ర్కిప్షన్ మార్చుకోవచ్చు.. లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు.
7. వెరీఫై పై క్లిక్ చేస్తే చాలు.. మీ ప్రస్తుత బిల్లింగ్ సైకిల్ సబ్ స్ర్కిప్షన్ నిలిచిపోతుంది.