2021 నుంచి ఈ యాండ్రాయిడ్, ఐఓఎస్‌లలో వాట్సప్ పనిచేయదు

2021 నుంచి ఈ యాండ్రాయిడ్, ఐఓఎస్‌లలో వాట్సప్ పనిచేయదు

Whatsapp: వాట్సప్ ఓల్డ్ వెర్షన్ ఆండ్రాయిడ్లకు గుడ్ బై చెప్పడం అలవాటు అయిపోయింది. అప్‌డేటెడ్ వర్షన్ ఆండ్రాయిడ్స్, ఐఓఎస్ లు వస్తుంటే పాత వాటిని పక్కకుపెట్టేస్తున్న వాట్సప్ 2021నుంచి మరికొన్ని ఆండ్రాయిడ్ లలోనూ పనిచేయడం మానేసేందుకు రెడీ అియంది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.3 అంతకంటే పాత వెర్షన్లలో, ఐఓఎస్9 అంతకంటే పాత వెర్షన్లలో సపోర్ట్ చేస్తున్న వాట్సప్.. రీసెంట్ గా రిటైర్ అవుతున్నట్లు చెప్పేసింది. అంటే దీనిని ఆండ్రాయిడ్ 4.3, ఐఓఎస్ 9 వెర్షన్ల కంటే పాత వాటిలో సపోర్ట్ చేయదన్నమాట. అతి త్వరలోనే దీని గురించి అధికారిక అనౌన్స్‌మెంట్ విడుదల చేయనుంది వాట్సప్.

ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7, ఐఓఎస్ 8లు అంతకంటే పాత వెర్షన్లలో పనిచేయకుండాపోయింది. అదే విధంగా 2021 ఆరంభంలో ఈ వెర్షన్లను కూడా సైడ్ చేయనుందట. 2012లో లాంచ్ చేసిన ఆండ్రాయిడ్ 4.3 పాతదైపోయింది. అలాగే 2015లో ఐఓఎస్ 9ను లాంచ్ చేసింది యాపిల్. ప్రస్తుతం లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లుగా, ఆండ్రాయిడ్ 11, ఐఓఎస్ 14ను వాడుతున్న ఫోన్లలో అప్ డేటెడ్ వర్షన్ పనిచేస్తుంది.

ఒకవేళ మీరూ ఇంకా పాత ఫోన్ నే వాడుతున్నట్లు మీరు అనుకుంటే.. మీ ఫోన్లలో మరికొద్ది నెలల్లో వాట్సప్ పనిచేయకుండా పోతుందేమోనన్న భయం మీకుంటే ఇలా చెక్ చేసుకోండి.. ఆండ్రాయిడ్ ఫోన్లలో Settings > General > About Phone అని యాపిల్ ఫోన్లలో చూసుకోండి.