Xiaomi NFC Pay: వాచ్ బెల్ట్‌తోనే మనీ ట్రాన్సాక్షన్లు.. షియోమీ నుంచి అద్భుతమైన ఫీచర్

సైన్స్ టెక్నాలజీ ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో పాతుకుపోయిన షియోమీ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.

Xiaomi NFC Pay: వాచ్ బెల్ట్‌తోనే మనీ ట్రాన్సాక్షన్లు.. షియోమీ నుంచి అద్భుతమైన ఫీచర్

Xiomi

Xiaomi NFC Pay: సైన్స్ టెక్నాలజీ ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో పాతుకుపోయిన షియోమీ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. సౌండ్‌ను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్‌ చేసే టెక్నాలజీని.. స్మార్ట్‌ఫోన్స్‌తో భూకంపాలను గుర్తించే టెక్నాలజీలను డెవలప్ చేసిన షియోమీ.. కాంటాక్ట్‌ లేస్‌ పేమెంట్స్‌కు శ్రీకారం చుట్టింది.

లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్‌వాచ్‌ బెల్ట్‌ను (స్ట్రాప్ సహకారంతో) లావాదేవీలను జరిపే టెక్నాలజీని త్వరలోనే ఆవిష్కరించనుంది. ఎలిజిబుల్ మర్చంట్స్‌కు కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్లు చేయొచ్చట. షియోమీ ఎన్ఎఫ్సీతో టై అప్ అయిన బ్యాంకు గురించి ఇన్ఫర్మేషన్ లేకపోయినా.. ఎన్ఎఫ్సీ పేమెంట్స్ మాత్రం త్వరలోనే మొదలుపెట్టనున్నట్లు తెలిపింది.

ఈ మేర చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రఘురెడ్డి కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ టెక్నాలజీని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో నమోదు చేసినట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. స్మార్ట్‌వాచ్స్‌కు అమర్చే స్ట్రాప్‌లు ఎన్‌ఎఫ్‌సీతో పనిచేయనున్నాయి. ఎన్‌ఎఫ్‌సీ లావాదేవీల్లో భాగంగా షియోమీ పార్టనర్స్‌గా భాగస్వాములైన రూపే, ఆర్‌బీఎల్‌, జెటాతో పనిచేస్తుందని వెల్లడించారు.

………………………………: పిల్లలపై కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్.. సీరమ్‌కు కీలక అనుమతులు

ఈ స్ట్రాప్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు రఘు ట్విటర్‌ పేర్కొన్నారు. ఆగష్టులో జరిగిన స్మార్టర్ లివింగ్ 2022 వర్చువల్ ఈవెంట్ లో ఎమ్ఐ బ్యాండ్ 6ను ఇండియాలో లాంచ్ చేశారు. దీని ప్రత్యేకత సింగిల్ ఛార్జ్ తో 14రోజుల పాటు బ్యాటరీ లైఫ్ అలాగే ఉంటుంది.