YouTube Kids: పిల్లలకు యూట్యూబే పాపులర్ యాప్

ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్ లతో పెద్దవాళ్లు ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలేమో కేవలం యూట్యూబ్ కే ప్రియారిటీ ఇస్తున్నారట. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్..

YouTube Kids: పిల్లలకు యూట్యూబే పాపులర్ యాప్

Youtube

YouTube Kids: ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్ లతో పెద్దవాళ్లు ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలేమో కేవలం యూట్యూబ్ కే ప్రియారిటీ ఇస్తున్నారట. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్స్ వరకూ మారి యూట్యూబ్ వీడియోలను ఈజీగా చూసేస్తున్నారు. వీడియోస్, మ్యూజిక్, గేమ్స్ లాంటి స్పెషల్ ఫీచర్లకు యాక్సెస్ ఇస్తుండటంతో ఈ పాపులర్ యాండ్రాయిడ్ యాప్ పిల్లల్లోకి దూసుకెళ్లిపోయింది.

న్యూ కాస్పర్‌స్కై సేఫ్ కిడ్స్ సెర్చ్ ప్రకారం.. సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ 2021లో ప్రపంచవ్యాప్తంగా.. పిల్లలు వారి ఎక్కువ సమయాన్ని యూట్యూబ్ యాప్ లోనే గడిపేశారు. 31.42శాతం మంది 10మోస్ట్ పాపులర్ యాప్ లపై గడిపారు. అందులో వాట్సప్ 19.17శాతం, టిక్ టాక్ 18.77శాతం ఉన్నాయి. ఇక తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్, నెట్ ఫ్లిక్స్ లు 5.21శాతం, 2.45శాతం, 2.15శాతం దక్కించుకున్నాయి.

యూట్యూబ్ లోనూ పిల్లలు దాదాపు వీడియో గేమ్స్ లాంటి వీడియోలనే సెర్చ్ చేశారట. మ్యూజిక్ కేటగిరీకి సంబంధించిన వీడియోలను 19.14శాతం మంది వాచ్ చేశారట. యూట్యూబ్ బ్లాగర్స్, మ్యూజిక్, కార్టూన్స్, టీవీ షోస్ లు 16.29శాతం వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయి.

ఇది కూడా చదవండి : వారి ఖాతాల్లోకి రూ.703 కోట్లు.. ఏపీ ప్రభుత్వం తీపికబురు