Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి

హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అతిగా ఫోన్ మాట్లాడుతుందని ఓ వ్యక్తి కన్న కూతురునే హత్య చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.

Father Killed Daughter : అతిగా ఫోన్ మాట్లాడుతుందని.. కూతురును హత్య చేసిన తండ్రి

father killed daughter

father killed daughter : హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం జరిగింది. అతిగా ఫోన్ మాట్లాడుతుందని ఓ వ్యక్తి కన్న కూతురునే హత్య చేశాడు. బాకారంలో 17 ఏళ్ల యాస్మిన్ ఉన్నిసా అనే యువతి రాత్రి వేళ ఫోన్ అధికంగా మాట్లాడుతున్నారు. అయితే ఫోన్ మాట్లాడటం తగ్గించుకోవాలని తండ్రి మహమ్మద్ తౌఫీ ఆమెకు సూచించారు.

అయితే ఆ యువతి తండ్రి మాటలను పట్టించుకోలేదు. ఎంత చెప్పినా వినకుండా ఫోన్ లో అలాగే మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన తండ్రి ఆదివారం ఉదయం కుమార్తె గొంతు నులిమి చంపేశారు.

Man Shot Daughter: పరువు హత్య.. ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురును కాల్చి చంపిన తండ్రి.. సహకరించిన తల్లి

అనంతరం తండ్రి మహమ్మద్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.