Munugode By Poll : మునుగోడు ప్రచారానికి ముగింపు .. స్థానికేతలు వెళ్లిపోవాలని కలెక్టర్ హెచ్చరిక

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి సాయంత్రం 6గంటలకు తెరపడనుంది. దీంతోమునుగోడులో కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడుతో పాటు పరిసర ప్రాంతాల్లోను హోటల్స్, లాడ్జిలు, ఫంక్షన్ హాల్స్ పరిశీలిస్తున్నారు. మునుగోడు నుంచి నుంచి స్థానికేతరులు అంతా వెళ్లిపోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

Munugode By Poll : మునుగోడు ప్రచారానికి ముగింపు .. స్థానికేతలు వెళ్లిపోవాలని కలెక్టర్ హెచ్చరిక

Munugode Bypoll

Munugode Bypoll: మునుగోడు..కేవలం తెలంగాణాలోనే కాకుండా ఢిల్లీలో కూడా సెగలు పుట్టిస్తోంది ఈ మునుగోడు ఉప ఎన్నిక. ఓ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఇప్పటి వరకు ఇంత వేడిపుట్టించలేదనే చెప్పాలి. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ బరిలో నెగ్గాలని..విజయం సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అన్ని పార్టీలు ఆరోపణలు..ప్రత్యారోపణలు..విమర్శలు ప్రతివిమర్శలతో మునుగోడు నియోజకవర్గం హోరెత్తిపోయింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి మంగళవారం (నంబంర్ 1,2022) సాయంత్రం 6గంటలకు తెరపడనుంది. దీంతోమునుగోడులో నల్లగొండ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డి పర్యటిస్తున్నారు. మునుగోడుతో పాటు పరిసర ప్రాంతాల్లోను హోటల్స్, లాడ్జిలు, ఫంక్షన్ హాల్స్ పరిశీలిస్తున్నారు. మునుగోడు నుంచి నుంచి స్థానికేతరులు అంతా వెళ్లిపోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరించారు.

మునుగోడు ఉప ఎన్నికల కావాల్సిన అన్ని ఏర్పాట్లను నల్లగొండ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మునుగోడు పరిశిలో ఏర్పాటుచేసిన 298 పోలింగ్ బూత్ ల వద్ద పరిస్థితి..ఏర్పాట్లను పరిశీలించారు. మునుగోడు ఉప ఎన్నిక మంచి రసవత్తరంగా జరుగనున్న క్రమంలో మసస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని అనుమానం ఉన్న ప్రాంతాల్లోను వ్యక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్ విజయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు మునుగోడులో ఓటర్లను ప్రభావితం చేయటానికి డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీలు క్షుణ్ణంగా జరిపామని ఈ తనిఖీల్లో రూ.3కోట్ల నగదును పట్టుకున్నామని తెలిపారు. ఈ రెండు రోజులు తనిఖీలు మరింత ముమ్మరంగా క్షుణ్ణంగా చేస్తామని వెల్లడించారు. అలాగే ఎన్నిక ముగిసే వరకు శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని 10టీవీకి వెల్లడించారు కలెక్టర్.

కాగా..మునుగోడు పోలింగ్ పూర్తి అయ్యే వరకు పోలీసులకు కత్తిమీద సాము అనే చెప్పాలి. పోలింగ్ జరగటం ఓ ఎత్తు అయితే..ఇక పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చేవరకు హైటెన్షన్ ఉండనుంది. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రధాన రాజకీయపార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయి. మరోవైపు డబ్బు, మద్యం పంపిణీలు కొనసాగుతున్నాయి. ప్రచారం ముగింపు రోజున టీఆర్ఎస్ తరఫున మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రోడ్‌షోలు నిర్వహించనుండగా..బీజేపీ కొన్ని మండలాల్లో బైక్‌ ర్యాలీలు, కాంగ్రెస్‌ మహిళా గర్జనను నిర్వహించనున్నాయి. 298 పోలింగ్‌ బూత్‌లలో 2,41,855 మంది మునుగోడు ఓటర్లు రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చనున్నారు. ఇక్కడ ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్, బీజేపీలు పూర్తిగా కేంద్రీకరించి పని చేయగా, కాంగ్రెస్‌ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవటానికి తన యత్నాలుతాను చేస్తోంది.