Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు

సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5, 6వ అంతస్తులకు అనుమతి లేదని అధికారులు ధృవీకరించారు.

Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు

FIRE INCIDENT

Ramgopalpeta Fire Incident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఫైర్ సిబ్బంది నలుగురిని రక్షించింది. కాగా, రెస్క్యూ చేస్తుండగా ఇద్దరు ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు. అధికారులు బిల్డింగ్ పటిష్టతను పరిశీలించనున్నారు. బిల్డింగ్ పరిసర ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించారు.

Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

గురువారం రాంగోపాల్‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 11.00 గంటలకు డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్ వన్‌లో మొదలైన మంటలు క్రమంగా పై అంతస్థులకు వ్యాపించాయి. ఈ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలార్పడం కష్టమైంది. మరింత భారీగా మంటలు వ్యాపించాయి. మరోవైపు దట్టమైన పొగ కూడా అలుముకుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. బిల్డింగ్ ఎల్ ఆకారంలో ఉండటం వల్ల కూడా సహాయక చర్యలకు కష్టమైంది. మళ్లీ వ్యాపించిన మంటల కారణంగా పక్క బిల్డింగ్, వెనుకవైపు ఉన్న బిల్డింగులకు కూడా మంటలు అంటుకున్నాయి.

secunderabad : ‘బిల్డింగ్ మొత్తం మెటీరియల్‌తో నింపేశారు..అందుకే మంటలు అదుపులోకి రావటం కష్టమవుతోంది’ : మంత్రి తలసాని

అగ్ని ప్రమాదం సంభవించిన బిల్డింగ్ లోపల మరింత మంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ క్రమంలో లోపల ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆక్సిజన్ మాస్కులు ధరించి బిల్డింగులోకి చేరుకున్నారు. ఈ ప్రమాదం నుంచి నలుగురిని ఫైర్ సిబ్బంది రక్షించింది. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటానా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటల ప్రమాదం నుంచి కొంతమందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని మంత్రి తెలిపారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి,  పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి స్పందన రావడంలేదని తెలిపారు. ఈ భవనంలో క్లాత్ మెటీరియల్ పెద్ద ఎత్తున నిల్వ ఉండడంతో భారీ స్థాయిలో మంటలు వచ్చాయన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని..ఎవ్వరు ఆందోళన చెందవద్దన్నారు. ఈ అగ్నిప్రమాదం దురదృష్టకరమని, అనుమతులు లేని భవనాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేయాలని జీహెచ్ ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు.